కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయాని, ధర్మానికి ప్రతీకలైతే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్. ఇది ఒక సినిమాలో మోస్ట్ పవర్ ఫుల్ పంచ్ డైలాగ్.. ఈ డైలాగ్ విన్న ప్రతి వారి ఒంట్లో ఒక రకమైన ప్రకంపనలు పుట్టడం మాత్రం ఖాయం. ఎందుకంటే ఈ చిన్న డైలాగ్‌లో పోలీసు పవర్ చూపించాడు, పోలీస్ పరువును నిలబెట్టాడు సాయికుమార్.. అయితే ఈ మధ్యకాలంలో ఆ కనిపించని నాలుగో సింహాలకు శృంగారలేపనం అంటినట్లుగా ఉంది.. ఎందుకంటే ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే ముందుగా తల్లిదండ్రులకు చెప్పుకుంటారు. ఆ తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్లుతారు.. అంటే కన్నవారి తర్వాత అంతటి విలువను పోలీసు డిపార్ట్‌మెంట్ అందుకుంటుందన్న మాట..

 

 

మరి ప్రజలకు వారధిగా ఉండే ఖాకీలు ఈ మధ్యకాలంలో ఒక విషయంలో టాప్‌లో నిలిచారట. ప్రజలను రక్షించవలసిన విషయంలో కాదండి.. అక్రమ సంబంధాలను నెరపడంలో మొదటి స్దానాన్ని ఆక్రమించారు. అందరు కాదండి బాబు.. ఒక గుంటూరు పోలీసులు మాత్రమే. గుంటూరు మిర్చికెంత పవర్ ఉందో, ఇక్కడి పోలీసులకు అంతే పవర్ ఉందట.. ఇక ఆ వివరాలు తెలుసుకుంటే.. న్యాయం చేయమని పోలీసు స్టేషన్ కు వచ్చిన మహిళలను ట్రాప్ చేసి వారితో ఇల్లీగల్ ఎఫైర్స్ నడుపుతూ చివరికి ఉద్యోగం నుంచి సస్పెండవుతున్న వారిలో గుంటూరు జిల్లా పోలీసులు ముందుంటున్నారు.

 

 

తాజాగా ఒక మహిళతో అక్రమ సంబంధం నడిపి ఆమెను మోసం చేసిన కేసులో నగరపాలెం సీఐ వెంకటరెడ్డిపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. జిల్లాలో వరుసగా ఇలాంటి ఘటనలు వెలుగుచూడటంతో పోలీసు శాఖపై విమర్శలు ఎక్కువయ్యాయి. ఇకపోతే గుంటూరు జిల్లాలో కొంతకాలం నుంచి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇక ఇదివరకు గుంటూరు జిల్లా అరండల్‌పేట ఎస్ఐ బాలకృష్ణ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది.

 

 

ఈ ఘటనలో ఎస్ఐ బాలకృష్ణతో పాటు ఆయనకు సహకరించిన మరో ఇద్దరు కానిస్టేబుళ్ళను సస్పెండ్ చేశారు. ఇదిలా ఉండగా మరో ఎస్ఐ కూరపాటి నాగేంద్ర కూడా తనను లైంగికంగా వేధించారని ఒక యువతి ఫిర్యాదు చేసింది. తాజాగా సీఐ వెంకట రెడ్డిపై  వచ్చిన ఆరోపణలు నిజమని తేలటంతో ఉన్నతాధికారులు ఆయన్ను సస్పెండ్ చేశారు. ఇకపోతే ఇలా వరుసపెట్టి లైంగిక ఆరోపణల కేసుల్లో ఎస్సైలు, సీఐలు, కానిస్టేబుళ్లు సస్బెండవుతూ ఉండటంతో డిపార్ట్‌మెంట్ పరువు పోతోందని అధికారులు వాపోతున్నారు... ఏది ఏమైనా దోషుల్ని శిక్షించవలసిన వారే ఇలాంటి పనులు చేస్తుంటే, ఇక ప్రజలకు న్యాయం చేసేవారెవరనే ప్రశ్నతలెత్తుతుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: