ఓ ప్రజా ప్రతినిధి అత్యాచార ఘటనలో ఇరుక్కున్నాడు.. ఇప్పటికే లోకంలో అత్యాచారాల పర్వం కొనసాగుతుండగా, ఇందులోకి సామాన్యమానవుల వలే ప్రజా ప్రతినిధులతో పాటుగా, కొందరు ఉన్నత అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా అప్పుడప్పుడు బయటకు వస్తున్నారు. ఇక ఇలాంటి దశలో తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ త్రిపాఠితో పాటుగా, ఆయనకు సంబంధించిన ఆరుగురు కుటుంబ సభ్యులపై ఈ రోజు బదోహి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారట. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటే.

 

 

బదోహీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రవీంద్రనాథ్ తను 2017లో ఓ హోటల్ లో బంధించి పలుసార్లు రేప్ చేశాడని, అతనే కాకుండా, అతని మేనల్లుడుతో సహా మరో ఆరుగురు అతని ఫ్యామిలీకి దగ్గరి వ్యక్తులు తనపై హత్యాచారం చేశారంటూ, ఓ మహిళ  గత వారం రోజుల క్రితం, అంటే ఫిబ్రవరి 10 న కంప్లెయింట్ ఇచ్చినట్లు ఎస్పీ రామ్ బదన్ సింగ్ తెలిపారు. అంతేకాకుండా తాను ప్రెగ్నెంట్ కూడా  అయ్యాయని, వీళ్లే బలవంతంగా అబార్షన్ చేయించారని కూడా ఆ మహిళ చెప్పినట్లు ఎస్పీ తెలిపారు.. అందుకే బదోహి సిటీ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యేతో పాటుగా, మిగతా ఆరుగరు పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

 

 

ఇకపోతే సదరు మహిళ స్టేట్‌మెంట్ ను మెజిస్ట్రేట్ సమక్షంలో రికార్డ్ చేయబడుతుందని, ఆ తర్వాత చట్టప్రకారం తదుపరి చర్య తీసుకోనున్నట్లు ఎస్పీ రామ్ బదన్ సింగ్ ఈ సందర్భంగా తెలిపారు. ఏంటో లోకం ఎటువైపు పోతుందో తెలియడం లేదు. తప్పుచేయని రాజకీయనాయకులు ఒక్కరు కూడా కనిపించడం లేదు. వ్యవస్దను సరిదిద్దేవారు అలాగే ఉన్నారు. బాధ్యతగల వ్యక్తులు అలాగే ప్రవర్తిస్తున్నారు.. ఇంకా ముందు ముందు సమాజసేవ అని చెప్పుకుంటూ నాయకులు ఇంకా ఎన్ని దారుణాలకు తెగబడతారో... అని అనుకుంటున్నారు ఈ విషయం తెలిసిన వారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: