మాయదారి మహమ్మారి వెంటాడుతూనే ఉంది. గతకొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో... H1N1 వైరస్ మళ్ళీ పంజా విసురుతోంది.  స్వైన్ ఫ్లూ లక్షణాలతో జనం ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. అయితే స్వైన్ ఫ్లూ లక్షణాలను ఏమాత్రం అశ్రద్ద చేసినా ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు డాక్టర్లు.

 

తెలుగు రాష్ట్రాల్లో అడపాదడపా స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోవటంతో స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఉన్నవాళ్ళు ఆస్పత్రుల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. దీంతో మరోసారి హైదరాబాద్‌లో స్వైన్ ఫ్లూ కేసులు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ఇద్దరికి స్వైన్ ఫ్లూ చికిత్స జరుగుతుండగా మరో ఐదుగురు అనుమానితులకు పరీక్షలు జరిపారు. 

 

మన వాతావరణంలో పూర్తిగా కలిసిపోయిన H1N1 వైరస్‌ తన ప్రతాపాన్ని ఇప్పటికి చూపుతోంది. ఈ ఏడాది 63 మంది స్వైన్‌ఫ్లూ బారిన పడ్డారు. ఇందులో ఐదుగురు మరణించారు. వాతావరణం చల్లబడితే చాలూ వైరస్ ప్రభావం పెరిగిపోతుంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు దాదాపు 30 మందికి స్వైన్ ఫ్లూ నిర్దారణ అయ్యింది. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళపై ఈ వైరస్ ప్రతాపాన్ని చూపుడుతోంది. ఐదేళ్ల లోపు పిల్లలతోపాటు అరవై సంవత్సరాలకు పైబడిన ముసలి వాళ్ళు, గర్భిణీ స్త్రీలు, ఆస్తమా రోగులు.. క్యాన్సర్ భారిన పడిన వాళ్ళకు స్వైన్ ఫ్లూ త్వరగా సోకుతుంది. అందుకే వీరంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 

 

స్వైన్‌ఫ్లూ... ఈ పేరు వింటే చాలు  హడలిపోతారు జనం. 2009లో రాష్ట్రంలోకి వచ్చిన ఇన్‌ఫ్లూయాంజా వైరస్ జనంపై విరుచుకపడింది. చాలా మందిని బలితీసుకుంది. ప్రతియేటా కొంతమంది ఈ మహమ్మారికి బలౌతూనే ఉన్నారు. అయితే గతంలోలాగా ఇపుడు H1N1 వైరస్‌కు బయపడాల్సిన అవసరం లేకపోయినా, అటాక్ అయితే మాత్రం వెంటనే చికిత్స చేయించుకోవాలంటున్నారు వైద్యులు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: