చంద్రబాబునాయుడు రాజకీయమే విచిత్రంగా ఉంటుంది.  మొన్నటి ఎన్నికల్లో తగిలిన గట్టి దెబ్బ ఫలితంగా ఏం మాట్లాడుతున్నారో కూడా ఎవరికీ అర్ధం కావటం లేదు.  అందుకనే ప్రజా చైతన్య యాత్రలో పర్చూరులో జరిగిన మొదటి సమావేశంలో  చంద్రబాబు మాట్లాడుతూ  తాగుబోతులకు మద్దతుగా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు చంద్రబాబు యాత్ర మొదలుపెట్టిందే  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగ అన్న విషయం మరచిపోకూడదు.

 

మామూలుగా సమాజంలో తాగుబోతులంటే మెజారిటి జనాల్లో పాజిటివ్ ధృక్పధం ఉండదు. ప్రధానంగా మహిళల్లో అయితే మద్యానికి  పూర్తి వ్యతిరేకంగా ఉంటారు. మరలాంటపుడు చంద్రబాబు తాగుబోతులకు మద్దతుగా మాట్లాడితే వాళ్ళ మద్దతు ఎలా సంపాదించగలరు ? మొత్తం సమాజాన్ని తీసుకుంటే మందు తాగే వాళ్ళ సంఖ్య తక్కువనే చెప్పాలి. మద్యం వల్ల సర్వనాశనం అయిపోయిన కుటుంబాలు లక్షల్లో  ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే.

 

ఇటువంటి రుగ్మత విషయంలో చంద్రబాబు అసలు మాట్లాడకుండా ఉంటేనే బాగుండేది. అయితే జగన్ పై ఉన్న గుడ్డి వ్యతిరేకతతో ప్రతిది వ్యతిరేకించాలన్న ఆలోచనతో చివరకు మద్యం ధరలను పెంచటాన్ని కూడా తప్పు పడుతుండటమే విచిత్రంగా ఉంది.  మద్య నిషేధంలో భాగంగా దశలవారీగా  మద్యం ధరలను పెంచేస్తానని ఎన్నికల సమయంలోనే జగన్ చెప్పారు. దాన్ని జనాలు ఆమోదించారు కూడా. మెజారిటి జనాలు ఆమోదించిన పాయింటును పట్టుకుని జగన్ ను చంద్రబాబు తప్పుపట్టడటమే విచిత్రం.

 

 

రోజంతా కష్టపడి ఏదో ఓ పెగ్గు వేసుకుందామని అనుకుంటే ధరలు పెంచేశారంటూ మండిపడ్డారు. మద్యం ధరలు పెంచేయటం తప్పన్నట్లుగా, మందు తాగటం తప్పే కాదన్నట్లుగా ఉంది చంద్రబాబు వ్యాఖ్యలు. అదే పనిగా తాగుబోతులకు మద్దతుగా ఎందుకు మాట్లాడుతున్నట్లు ? ఎందుకంటే రేపటి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వాళ్ళ ఓట్ల కోసమే అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. సమాజంలోని మెజారిటి జనాలు వ్యతిరేకిస్తున్న మద్యానికి వ్యతిరేకంగా చంద్రబాబు మద్దతుగా మాట్లాడటమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: