అదో గేమ్... ఏదో సాదాసీదా గేమ్ అనుకునేరు... ఒకసారి గేమ్ లోకి వెళ్లారు అంటే... బయటకి రావడం మీ తరంకాదు... ఒకవేళ బయటకు వచ్చినా మరొక్కసారి ఆడాలి అనిపిస్తుంది... ఇక ఇంకోసారి ఆడితే ఆ గేమ్ కి పరిమితం కావాల్సి వస్తోంది. ఈ మాయదారి గేమ్ ఎంతోమందిని పిచ్చివాళ్ళను చేసింది... ఎంతోమంది ప్రాణాలు కూడా తీసింది... ఇక కొన్ని రాష్ట్రాల్లో అయితే ఈ మాయదారి గేమ్ను బ్యాన్ చేయాలి అంటూ ఎన్నో నిరసనలు కూడా జరిగాయి.. అయినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఇంతకీ ఈ గేమ్ ఏమిటి అనుకుంటున్నారా... ప్రస్తుతం ప్రపంచాన్నంతటినీ ప్రభావితం చేస్తూ తన మాయలో పడేస్తున్న పబ్జి గేమ్. ప్రస్తుతం ఈ గేమ్ మోజు లోనే ప్రపంచం మొత్తం ఊగి పోతుంది. పబ్జి గేమ్ లో మునిగిపోతున్న యువత పెద్దలు... ఒకానొక సమయంలో పిచ్చివాళ్లు గా మారిపోయి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. 

 

 

 

 అయితే పబ్లిక్ గేమ్ ఎంత మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ పబ్జి గేమ్ ఆడటం మాత్రం తగ్గడం లేదు రోజురోజుకూ వాడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగి పోతుంది. అయితే ఈ పబ్జి గేమ్ లో  ప్రత్యర్థులు అందరిని చంపేసి చివరికి మనమే మిగిలితే అప్పుడు గెలిచినట్లు. ఒకవేళ మనం గెలిస్తే విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ అంటూ అవార్డు దక్కుతుంది. ఇక పబ్జి గేమ్ తెర మీదికి వచ్చినప్పుడు నుండి ఈ మాట ఎక్కడపడితే అక్కడ కనిపిస్తోంది. ఏకంగా విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ అంటూ కొన్ని పాటలు కూడా రూపొందాయి అంటే ఈ వ్యాఖ్యలు ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో  అర్థం చేసుకోవచ్చు. 

 

 

 

 అయితే విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ అనే స్లోగన్... పబ్జి గేమ్ తెర మీదికి వచ్చి నప్పటి నుంచే అందరికీ తెలిసిందా లేక అంతకు ముందు నుంచే ఉందా అనేది మాత్రం చాలామందికి ఉన్న ప్రశ్న. అయితే విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ అనే  స్లోగన్ గ్యాంబ్లింగ్ గేమ్ నుండి పుట్టింది. 1930 లలో ఆర్ధిక సంక్షోభం ఏర్పడి నప్పుడు... అప్పటి జనాలందరూ డబ్బుల కోసం జూదం ఆడేవారట . ఇక జూదంలో గెలిస్తే రోజు చికెన్ తినడానికి సరిపడా డబ్బులను ఇచ్చేవారట. అంతేకాదు గ్యాంబ్లింగ్ పై వచ్చిన 21 సినిమాలో కూడా ఈ పదాన్ని ఉపయోగించారట. అయితే ఈ పదాన్ని ఎక్కువగా లాస్ వెగాస్ లో ఉపయోగించేవారట. ఇక ఇప్పుడు పబ్జి గేమ్ లోకి ఈ స్లోగన్  వాడిన తర్వాత ఈ స్లోగన్ మరింత ఫేమస్ అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: