చైనా ఇప్పుడు ప్రపంచదేశాలకు ప్రమాదకరంగా మారిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి... ఎందుకంటే ఇప్పుడు చైనా వల్ల అణుబాంబుకంటే ఎక్కువ విస్పోటనం ప్రపంచదేశాల్లో జరుగుతుంది. ఇప్పటికే కరోనా వైరస్ ధాటికి ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. ఇక రోజు రోజుకు ఉగ్రరూపం దాల్చుతున్న ఈ వైరస్‌ను అరికట్టేందుకు చైనా సహా పలు దేశాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవన్నీ పక్కనబెడితే ఇంతకీ ఈ 'కరోనా వైరస్‌' ఎలా పుట్టుకొచ్చింది అనేది రోజురోజుకీ ప్రశ్నార్థకంగా మారుతోంది...

 

 

ఇకపోతే ఇప్పటి వరకు ఈ కరోనా వైరస్ 26 దేశాలకు వ్యాపించగా అధికారికంగా 73000 కేసులు నమోదయ్యాయని తెలుస్తుంది.. ఇంకా అనధికారంగా చూస్తే ఈ వ్యాధి తీవ్రత లక్షల్లో ఉంది.. కానీ బయటకు మాత్రం రావడం లేదు... ఇకపోతే చైనా గతంలో ‘సార్స్‌’ వైరస్‌ విషయంలోనూ ఇలాగే ప్రపంచానికి నష్టం చేకూర్చి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అంతే కాకుండా రహస్య జీవాయుధ ప్రయోగాలే కరోనాకు కారణమనీ, గబ్బిలాలపై ప్రయోగాలే ఈ దుస్థితిని తెచ్చాయనీ ఏవేవో అనుమానాలకు అది ఆస్కారం ఇచ్చింది.

 

 

ఇక కరోనాకు సంబంధించి హెచ్చరికలు చేసినవారి నోరుమూయించడం, వైరస్‌ విజృంభణ నిర్థారించినందుకు పదిమంది డాక్టర్లను జైల్లోపెట్టడం, బాధితుల సంఖ్య హెచ్చుతున్నా అధికారిక లెక్కలు మార్చకపోవడం వంటి స్వల్పబుద్ధి చేష్టల వల్ల ఇప్పుడు ప్రపంచ ఆరోగ్యసంస్థకు తెలియచేస్తున్న వివరాల్లోనూ అది పారదర్శకత పాటించడం లేదన్న అనుమానాలు వేళ్ళూనుకున్నాయి. ఇలాంటి పరిస్దితుల్లో ఉగ్రవాద దేశంగా ముద్రించబడ్ద పాకిస్దాన్ కంటే చైనా జీవాయుధ దేశంగా చెడ్దపేరు మూటగట్టుకుంది..

 

 

ఇకపోతే ఇదంతా ఒక ఎత్తైతే ఈ కరోనా కాటుతో చైనా ఆర్థికం చావుదెబ్బతిన్నది. ఇప్పటికే పదినగరాలు, వేలాది ఫ్యాక్టరీలు మూతబడిన కారణంగా చైనా సరఫరాలమీద ఆధారపడిన దేశాలన్నీ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. బల్క్‌ డ్రగ్స్‌ విషయంలో చైనామీద ఆధారపడిన భారత్‌ ఫార్మారంగానికి కష్టాలు ఆరంభమైనాయి. కొన్ని మందుల ధరలు ఇప్పటికే పెరిగాయి. ఎలక్ట్రానిక్స్‌, సోలార్‌, కెమికల్స్‌ ఇత్యాది రంగాలపై కొవిడ్‌ త్వరలోనే తీవ్ర ప్రభావం చూపబోతున్నది.

 

 

యాపిల్‌ వంటి గ్లోబల్‌ కంపెనీలు చవిచూడబోయే నష్టాలను లెక్కలేసుకుంటున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు తగ్గబోతున్నట్టు ఐఎమ్‌ఎఫ్‌ ప్రకటించింది. 2003లో సార్స్‌ ఇదే తరహాలో ప్రపంచ ఆర్థికాన్ని దెబ్బతీసింది. చైనా తన దాపరికంతో తాను ప్రమాదంలో పడటమే కాక, మిగతా ప్రపంచాన్నీ కష్టాల్లోకి నెట్టివేస్తున్నది.  ఏది ఏమైనా చైనా చేసిన బుద్ధిలేని పనివల్ల ఇప్పుడు ప్రపంచదేశాలన్ని ఒకరకంగా ప్రమాదంలో పడ్దట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: