మనిషి అంటే పేరులోనే మని ని పెట్టుకున్నాడు కానీ జీవితంలో ఆ మని ని చూసే వారు కొందరే ఉంటారు. వారే ధనవంతులుగా, కోటీశ్వరులుగా ప్రసిద్ది చెందారు.. ఇక సమాజంలో చాల మంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే డబ్బు చాలా ఉంటే ప్రపంచంలో ఏదైనా కొనవచ్చు అని ఆలోచిస్తారు.. ఆ డబ్బు సంపాధించడం కోసం కొందరైతే చేయకూడని పనులు కూడా చేస్తూ, జీవితాన్ని వెల్లబుచ్చుతారు..

 

 

ఇక నిజమైన ఆనందం, సంతోషం, సంతృప్తి ధనంలో ఉండదని కొందరు మాత్రమే గుర్తిస్తారు.. ఇకపోతే మనిషి జీవితం నీటి మీద బుడగ వంటిది. ఎప్పుడు చితికి పోతుందో తెలియదు. అందుకే మానవునికి నవ్విన, ఏడ్చిన కన్నీళ్లే వస్తాయి.. ఎందుకంటే ఆ కళ్లకు తెలుసు.. పుట్టుకతోనే అవి తన వెంటవచ్చాయని. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదని.. ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ అచ్చం బిచ్చగాడు సినిమా కధలా ఉంటుంది.

 

 

అందులో తల్లి కోసం హీరో బిచ్చగానిగా మారితే, ఇక్కడ కనిపించే స్టోరిలో మాత్రం మానసిక ప్రశాంతత కోసం బిచ్చగానిగా మారిన ఓ కోటీశ్వరుడు కనిపిస్తాడు..ఇతను కోట్ల ఆస్తులు వద్దనుకుని తమిళనాడులో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు ఆ వివరాలు తెలుసుకుంటే.. స్వీడన్‌కు చెందిన ‘కిమ్’ అనే వ్యాపారికి లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అక్కడ ఆయన ఓ ధనిక పారిశ్రామికవేత్త. కానీ అతనికి అవేవి మానసిక సంతృప్తిని ఇవ్వలేదట. ఇందుకు గాను తనకు తోచిన కొత్త మార్గాలు అన్వేషించడం ప్రారంభించాడట. చివరికి తన దేశాన్ని వదిలి కొన్ని నెలల క్రితం గోవాలోని ఇషా యోగా ధ్యాన కేంద్రాన్ని సందర్శించి, అక్కడ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సహాయం చేయడం ప్రారంభించాడు.

 

 

అయినా తను కోరుకున్న మానసిక ప్రశాంతత దొరకలేదు. దీంతో సరికొత్త అవతారం ఎత్తాడు. అక్కడి నుండి నేరుగా కోయంబత్తూరు చేరుకుని, అక్కడ వీధుల్లో సంచరిస్తూ వచ్చిపోయే వారిని రెండు చేతులతో దండం పెడుతూ బిచ్చమెత్తుకుంటున్నాడు. ఇక ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకుంటూ ఉన్నాడు గాని డిమాండ్ చేయడట.. ఇలా వచ్చిన సొమ్మునుతో తన అవసరాలు తీర్చుకొని.. మిగిలిన దాంట్లో పేదలకు సాయం చేస్తున్నాడు.

 

 

ఇలా చేయడం వల్ల నీకేంటని అడిగితే దీని ద్వారా తనకు మానసిక ప్రశాంతత లభిస్తుందని  కిమ్ చెబుతున్నాడు... నిజంగా ఇలాంటి వారిని చూసి ఎందరో ఆలోచనలో పడాలి.. తెల్లవారి లేచినప్పటి నుండి డబ్బు డబ్బు అంటూ వెంట పడుతారు. కాని పోయేటప్పుడు అణా పైసా కూడా తీసుకు వెళ్లరు..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: