ఏపీలో పార్టీలు మారిన, మనుషులు మారుతున్న పాత పగలు మాత్రం తగ్గడం లేదు.. రోజు రోజు సమాజంలో ఎంతగానో మార్పు వస్తుంది. అయినా గాని మనుషుల ఆలోచనల్లో ఏమాత్రం  మార్పు కనిపించడం లేదు.. ఇకపోతే తాజాగా చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ నేత విద్యాసాగర్ హత్యకు కుట్ర పన్నగా, అపన్నాగాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఆ వివరాలు తెలుసుకుంటే పీలేరుకి చెందిన రౌడీషీటర్ గణేష్ తో విద్యాసాగర్ ప్రత్యర్థులు ఒప్పందం చేసుకున్నారు. విద్యాసాగర్ హత్య విషయంలో గణేష్ కు సుపారీగా రూ.10 లక్షలు ఇచ్చారు. ఇందులో భాగంగా అడ్వాన్స్ గా రూ.2.5లక్షలు కూడా చెల్లించారట.

 

 

ఇక హత్యలో భాగంగా స్కెచ్ వేసిన ప్రత్యర్థులు విద్యాసాగర్ ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించగా, అది విద్యాసాగర్ కంట్లో పడిందట. ఏదో అనుమానం వచ్చినవాడిలా పోలీసులకు ఫిర్యాదు చేయగా, రంగంలోకి దిగిన పోలీసులు.. రౌడీషీటర్లు గణేష్, రత్నంను అదుపులోకి తీసుకుని ఆ కుట్రను భగ్నం చేశారు.. రాజకీయ కారణాలతోనే తన హత్యకు కుట్ర జరిగిందని విద్యాసాగర్ ఆరోపించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఇకపోతే ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు... మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

 

 

ఇదిలా ఉండగా విద్యాసాగర్ ను అసలు ఎవరు చంపాలని అనుకున్నారు.. అనే విషయాలు తెలియాలంటే పరారీలో ఉన్న మరో ఇద్దరు దొరికితే కానీ, సమాధానం దొరకదని పోలీసులు పేర్కొంటున్నారు.. ఇకపోతే విద్యాసాగర్ కుప్పం నియోజకవర్గంలో వైసీపీకి చెందిన సీనియర్ నేత. టీడీపీలో 20 ఏళ్ల పాటు ఉన్న ఆయన, రెండేళ్ల క్రితం వైసీపీలో చేరారు. ఇక విద్యాసాగర్‌కు సంబంధించిన ఈ కుట్ర వెలుగులోకి రావడంతో అలర్ట్ అయినా ఈయన, తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. దీనిపై దర్యాఫ్తు జరుగుతోందన్న పోలీసులు త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: