ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్సనల్ సెక్రటరీ శ్రీనివాస్ పై ఐటీ దాడులు జరిగి రెండు వేల కోట్లు బయటపడడం ఆంధ్ర రాజకీయాల్లో సంచలనం గా మారిన విషయం తెలిసిందే. మామూలుగానే అధికార పార్టీ చంద్రబాబు పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతుంది. మరి ఇలాంటి అవకాశం దొరికిన తరువాత ఎందుకు ఊరుకుంటుంది.  మరింతగా విమర్శల పర్వం పెంచింది. ఇక తాజాగా... ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ  ఐటీ  దాడులపై స్పందించారు. అధికారులపై ఐటీ  అధికారులు దాడులు చేయడం సహజంగానే మాజీ ముఖ్యమంత్రి సెక్రటరీ శ్రీనివాస్ అలాంటి వారిపై దాడులు జరగడం తన రాజకీయ జీవితంలోనే మొదటి సారి చూశాను అంటూ మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. 

 

 

తాజాగా విజయనగరంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ... ఐటి సోదాలపై  సమాధానం చెప్పిన తర్వాతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యాత్ర చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి పేరుతో తీవ్రస్థాయిలో కుంభకోణం జరిగిందని ఏడు నెలల క్రితమే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే గుర్తించామని తెలిపిన మంత్రి బొత్స... భూసేకరణలో అవకతవకలు జరిగాయంటూ తమ ప్రభుత్వం అప్పుడే చెప్పింది అంటూ వ్యాఖ్యానించారు. బీసీ మంత్రులను టార్గెట్ చేశారంటూ టీడీపీ నేతలు  ఆరోపిస్తున్నారు... టీడీపీ లో ఉన్నవారు మాత్రమే బీసీ నేతల... నేను కూడా బీసీ నేతనే అంటూ తెలిపారు. తప్పుల పై విచారణ చేపడితే కక్ష సాధింపు చర్యలు ఎలా అవుతుంది అంటూ ప్రశ్నించారు మంత్రి బొత్స. 

 

 

 రాష్ట్రంలో నిరుపేదల అందరికీ... పట్టా ఇల్ల ఇవ్వాలని ఉద్దేశంతోనే జగన్ సర్కారు ముందుకెళ్తున్నారు తెలిపిన మంత్రి బొత్స... తమ  దగ్గర పేదలందరికీ  ఇచ్చేంత భూమి ఉందని ఎలాంటి సమస్య లేదు అంటూ తెలిపారు. ఒకవేళ ఎక్కడైనా తక్కువ పడితే... డబ్బులు చెల్లించి భూమిని కొనుగోలు చేస్తామని తెలిపారు. టిడిపి ప్రభుత్వం భూసేకరణ ఎలా చేసిందో అలా మాత్రం తమ ప్రభుత్వం చేయదు అంటూ విమర్శించారు మంత్రి బొత్స. జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఎంతో పారదర్శకంగా ముందుకు సాగుతూ పాలన సాగిస్తున్నారని  ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు  అని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: