రోడ్డు నిబంధనలు పాటించకుండా... ఇష్టానుసారంగా వాహనాలు నడిపితే జరిమానాలు విధిస్తుంటారు  పోలీసులు. ఈ పరిస్థితుల్లో రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలను నడపాలని సూచిస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే రాజకీయ నాయకులకు ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా జరిమానాలు తప్పవు. అయితే కొంతమంది వాహనదారులు... కేవలం సామాన్య ప్రజలకే జరిమానా విధిస్తారు...  పోలీస్ వాహనాలకు నిబంధనలు అతిక్రమించిన జరిమానాలు విధించరు అని   నెటిజన్లు అనుకుంటూ ఉంటారు. కానీ ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే... రూల్స్ బ్రేక్ చేస్తే ఎవరైనా ఒకటే అని ఇక్కడ పోలీసులు నిరూపించారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన పోలీస్ వాహనానికి జరిమాన విధించారు పోలీసులు. 

 

 ఇది ఎక్కడ జరిగింది అనుకునేరు... మన హైదరాబాద్ నగరంలోనే... సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే... చట్టానికి ఎవరూ అతీతులు కాదు అంటూ ట్రాఫిక్ పోలీసులు మరోసారి నిరూపించారు. పోలీస్ కార్ ను హైదరాబాద్ లోని సైదబాద్ జంక్షన్ వద్ద  రహదారికి అడ్డంగా పెట్టారు. దీంతో అటుగా వెళ్తున్న వ్యక్తి దాని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రోడ్డుకు అడ్డంగా... ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా కారు పెట్టారు అని చెబుతూ సోషల్ మీడియా  ద్వారా... నగర్ పోలీస్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తా ఈ ఫోటోలు పోస్ట్ చేశాడు. 

 

 వెంటనే స్పందించిన మీరు చౌక్ ట్రాఫిక్ పోలీసులు ఆ పోలీస్ కార్ కు జరిమానా విధిస్తూ చలన్  పంపారు. రహదారికి అడ్డంగా పోలీసులు కారును నిలిపారు అని దీంతో నిబంధనల ప్రకారం 135 రూపాయలు జరిమానా చెల్లించాలంటూ ట్రాఫిక్  పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనతో నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానమేనని... ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే పోలీసులపైనా జరిమానాలు తప్పవని పోలీసులు నిరూపించారు అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ ఘటనతో అటు పోలీసులు కూడా కాస్త అలా అయిపోతారేమో.. !

మరింత సమాచారం తెలుసుకోండి: