ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ వారం బిజీ బిజీ గా గడిపారు. గత వారం ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన ఆయన, ఈ వారం పలు సంక్షేమ కార్యక్రమాల సమీక్షలు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సమీక్షలు నిర్వహించారు. అలాగే కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి. సోమవారం ఆయన ఐటి పాలసీ మరియు, నైపుణ్యాభివ్రుద్దిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇక మంగళవారం కర్నూలులో మూడో విడత కంటి వెలుగు కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. 

 

ఈ సందర్భంగా విపక్ష తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన విమర్శలు హైలెట్ గా నిలిచాయి. ప్రధానంగా, చంద్రబాబు కడుపు మంటకు వైద్యం లేదని, ఆయన మీద చలోక్తులు విసిరారు జగన్. ఇక పలు హామీలను కూడా ఆయన నాడు నేడు కి సంబంధించి ఇచ్చారు. తాడేప‌ల్లిలోని క్యాంప్ ఆఫీస్‌లో విద్యుత్ రంగంపై మంత్రి బాలినేని, సంబంధిత అధికారుల‌తో స‌మీక్ష‌. కృష్ణ‌ప‌ట్నం, వీటీపీఎస్ ప్రాజెక్టుల‌ను వెంట‌నే పూర్తి చేయాల‌ని నిర్ణయించారు. తాడేప‌ల్లి క్యాంప్ ఆఫీస్‌లో  కృష్ణా, గోదావ‌రి కాలువ‌ల ఆధునీకీక‌ర‌ణ‌కు సంబంధించి ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష చేసారు. 

 

ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రకాశం , కడప నెల్లూరు జిల్లాల రైతులకు సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. ఇక కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు జగన్. టీడీపీ ప్రభుత్వ అవినీతిపై ఆయన వేసిన సిట్ దెబ్బకు ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి మైండ్ బ్లాక్ అయింది. సిట్ ని ఏర్పాటు చేయడంతో పాటుగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక పోలీస్ స్టేషన్ ని సిట్ కి కేటాయించారు. తాడేపల్లి లోని తన నివాసంలో జగన్ కొన్ని కీలక సమీక్షలు నిర్వహించారు. రాజ్యసభ సీట్లకు సంబంధించి సీనియర్ నేతలతో చర్చలు జరిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: