చైనాలో గుర్తించబడిన కరోనా  వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటికీ ప్రాణ భయంతో వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇక చైనాలో అయితే పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. రోజురోజుకు కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరగడంతో పాటు కరోనా  మృతుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగి పోతుంది. ఈ వైరస్కు సరైన విరుగుడు లేకపోవడంతో ఈ వైరస్ సోకితే ప్రాణాలు పోవడం ఖాయం గా మారిపోయింది. దీంతో ఎంతో మంది ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఇక ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా శరవేగంగా వ్యాప్తిచెండుతుంది ఈ  ప్రాణాంతకమైన మాయదారి కరోనా వైరస్. అయితే ఈ ప్రమాదకరమైన వైరస్ మహిళలకంటే ఎక్కువగా మగవాళ్ళకి సోకుతుందట. 

 

 

 చైనాలో ఇప్పటివరకు 76 వేల మందికి ఈ వైరస్ బారిన పడగా వారిలో 2345 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ సోకిన వారిలో డెత్ రేట్  మగవారిలో 2.8 శాతం మహిళలు 1.7 శాతం ఉన్నట్లు చైనాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. గతంలో చైనాలో  వివిధ వైరస్ సోకిన సమయంలో కూడా మృతుల్లో ఎక్కువగా మగవాళ్లే ఉన్నారు అంటూ ఆ సంస్థ పలు కీలక సమాచారాన్ని వెల్లడించింది. అంతేకాకుండా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ లోవ పరిశోధకులు ఈ ప్రాణాంతక వైరస్ పై చేసిన ప్రయోగాల్లో మగవారికే ఈ వైరస్ సులభంగా సోకే ప్రమాదం ఉందని గుర్తించారు. 

 

 

 అయితే మగవాళ్లకు ఎక్కువగా సోకడానికి కారణం ఏమిటి అంటే... ఆడవాళ్ళ తో పోలిస్తే మగవాళ్ళలో పొగతాగే అలవాటు ఎక్కువగా ఉంటుంది. దీంతో బాడీలో రోగ నిరోధక శక్తి బలహీనపడటం వల్ల  స్త్రీలకంటే... పురుషులకు త్వరగా ఈ కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉంది. అంతేకాకుండా పురుషులతో పోలిస్తే మహిళల్లో ఇమ్యూనిటీ సిస్టం బలంగా ఉంటుందని... ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న పరిశోధనలలో వెల్లడైన విషయం తెలిసిందే. మహిళల్లో  క్రోమోజోమ్ లు ఎక్కువ  ఉండడం వల్ల జన్యుపరంగా వారు ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తి మగవారి కంటే ఎక్కువ ఉందని చెబుతున్నారు పరిశోధకులు. అంతేకాకుండా చైనా దేశంలో మహిళలతో పోలిస్తే షుగర్ బీపీ  ఎక్కువగా ఉన్నవారు మగవాళ్లు ఉన్నారు. దీంతో ఇలాంటి వారికి వైరస్ సోకిన కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇక జ్వరం లాంటి వచ్చినప్పుడు మహిళలు తొందరగా డాక్టర్ కి కలుస్తారని... అదే మగవాళ్లు అయితే తగ్గుతుంది లే అని నిర్లక్ష్యం చేస్తారని ఇలాంటి ఆలస్యం కారణంగా కూడా కరోనా  మృతుల్లో మగవారు ఎక్కువగా ఉండడానికి కారణం అవుతుంది అంటూ పరిశోధకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: