మందు బాబులం మేము మందు బాబులం.... మందు కొడితే మాకు మేమే మహారాజులం... నిజంగా ఇలాగే ఉంటుంది మందుబాబుల పరిస్థితి. ఫుల్లుగా తాగితే  అసలు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకే గుర్తుండని పరిస్థితి. ఇక మన హైదరాబాద్లో అయితే మందుబాబులు కొదవ ఎక్కడ ఉండదు. వైన్స్ ఎక్కడ కనిపించినా అక్కడ మందుబాబులు ఎక్కువగానే దర్శనమిస్తుంటారు. ఏదో కొంచెం తాగి ఆ తర్వాత ఇంటికెళ్ళి పడుకోవడం లాంటివి చేసేవారు కాదండోయ్... ఫుల్ గా తాగి హల్ చల్ చేసే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఇక పొద్దున లేచి నుంచి సాయంత్రం పడుకునే వరకూ.. ఆఫీసుకు వెళ్ళినట్టుగా వైన్ షాప్ లోనే సమయం మొత్తం గడుపుతూ ఫుల్లుగా తాగిస్తూ ఉంటారు. ఇక ఒక్కసారి చుక్క  వేశారు అంటే ఆ తర్వాత వారికి అడ్డొచ్చేవారెవరు . 

 

 

 అందుకే ఒక పెగ్గు వేశారు అంటే మందుబాబులు చేసే హల్చల్ మామూలుగా ఉండదు. ఇలా చాలామంది మందుబాబులు ఎక్కడో ఒకచోట హల్చల్ చేస్తూనే ఉంటారు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంటారు. ఇక తాజాగా సికింద్రాబాద్ లో కూడా ఓ మందుబాబు హల్చల్ చేశాడు. ఫుల్లుగా మద్యం మత్తులో తూగుతున్న మందు బాబు సంగీత్ సమీపంలోని ఓ విద్యుత్ స్తంభం ఎక్కాడు. ఇక దీన్ని గమనించిన స్థానికులు అతన్ని కిందకి దిగమని  అడుగగా... కిందికి దూకుత అంటూ బెదిరించాడు. అయితే మద్యం మత్తులో విద్యుత్ స్తంభం ఎక్కి హల్ చల్ చేస్తున్న వ్యక్తి ఇలియాస్ గా స్థానికులు గుర్తించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. 

 

 

 ఇక పోలీసు సార్లు కిందకి దిగిమని  చెప్పినా ఆ మందు బాబు వింటాడా... మందు మత్తులో ఉన్నాడు కాబట్టి రాజుల ఫీల్ అవుతూ ఉంటాడు. దీంతో స్థానికులు పోలీసులు అతన్ని సర్ది చెప్పే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు. తనకు క్వాటర్  మద్యం ఇస్తేనే స్తంభం దిగుతానని లేదంటే పైనుంచి దూకి తాను అంటూ ఏకంగా పోలీసుల తోనే బేరానికి  వచ్చాడు. చివరికి అతని డిమాండ్ మేరకు మద్యం సీసా తీసుకొచ్చి చూపించడంతో దిగేందుకు  అంగీకరించాడు ఆ వ్యక్తి. అయితే స్ట్రీట్ లైట్స్ బిగించేందుకు ఉపయోగించే క్రేన్ సాయంతో జిహెచ్ఎంసి సిబ్బంది అతని కిందకు దించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: