చైనాలోని వుహాన్ నగరంలో గుర్తించబడిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. చైనాలో అతి వేగంగా వ్యాప్తి చెందుతూ ఇప్పటికే వేల ప్రాణాలను బలి తీసుకున్న ఈ ప్రాణాంతకమైన వైరస్... ఇంకా ఎంతో మందిని  మృత్యుఒడిలోకి లాగుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతకమైన వైరస్ బారినపడి 2300 మంది మృతి చెందగా... 75  వేల మంది ఈ ప్రాణాంతకమైన వైరస్ సోకి ప్రాణభయంతో బతుకుతున్నారు. మొత్తం చైనా దేశాన్ని అతలాకుతలం చేస్తోంది ఈ ప్రాణాంతకమైన వైరస్. ఇక మెల్లిమెల్లిగా కొరియా ఆస్ట్రేలియా తదితర దేశాలకు కూడా పాకింది. 

 

 

 ఇప్పటికే పలు దేశాల్లో కరోనా వైరస్ కు సంబంధించి పాజిటివ్ కేసులు కూడా బయట పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు కరోనా  బారిన పడకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఇక ఆయా దేశాల ప్రభుత్వాలు కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. తమ దేశంలోకి కరోనా  వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ప్రజలు కూడా కరోనా  వైరస్ బారిన పడకుండా ఉండేందుకు సరికొత్తగా ఆలోచనలు చేస్తున్నారు. కొందరు జంతువు వేషధారణలో కనిపిస్తే మరికొందరు శరీరం పూర్తిగా కప్పే దుస్తులు ధరించి కరోనా  వైరస్ నుంచి తప్పించుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

 

 

 

 అయితే ఆస్ట్రేలియాలో ఓ విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు కరోనా  నుంచి తప్పించుకునేందుకు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇద్దరు  ప్రయాణికులు ప్లాస్టిక్ అవుట్ ఫిట్ తో కప్పి వేసుకున్నారు. ఇక ఒక మహిళ పింక్ కలర్ లో ఉన్న ప్లాస్టిక్ అవుట్ ఫిట్స్ ధరించి నిద్రపో గా మరో వ్యక్తి వైట్ కలర్ అవుట్ ఫిట్ ను  ధరించి ఉన్నాడు. ఇక వీరి వేషధారణ చూసి విమానంలోని ప్రయాణికులు అందరూ ఆశ్చర్యపోయారు. ఇక వారు వేసుకున్న ప్లాస్టిక్ ఔట్ ఫిట్ కి  పాటు అందం కూడా లేకపోవడంతో... ఇద్దరు ప్రయాణికులు ఊపిరి తీసుకోవడానికి కాస్త ఇబ్బంది కూడా పడ్డట్లు తెలుస్తోంది. అయితే కరోనా  వైరస్ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిదే కానీ.. మరి ఊపిరాడకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వైరస్ రాకముందే అసలుకే మోసం వస్తుందని కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: