ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా పిలువబడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి చాలామందికి ఒక ఐడియా ఉంది. ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్న వ్యక్తులలో ఒకరైన ట్రంప్ వ్యక్తిగత జీవితం కూడా విచిత్రంగా ఉంటుంది. ప్రజల మధ్య మాట్లాడే తీరు, అతని హావభావాలు, చేష్టలు చాలా మందికి విచిత్రంగా కనిపిస్తాయి. అలాగే అతను మరియు అతని భార్య లవ్ స్టోరీలో కూడా ఇలాగే ఎన్నో సంచలనాలు ఉన్నాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే ట్రంపు కన్నా అతని భార్య వయసు 24 ఏళ్లు తక్కువ. అసలు వీరిద్దరి మధ్య పరిచయం ఎలా జరిగింది? ప్రేమ ఎలా చిగురించింది? ఆమెతో వివాహం తర్వాత ట్రంప్ లో వచ్చిన మార్పులేమిటి అన్న విషయాలు తెలుసుకుందాం.

 

1970లో స్లోవేనియా లో జన్మించిన మెలానియా మంచి అందగత్తె. చిన్నప్పటినుండి ఫ్యాషన్ డిజైనింగ్ పై ఆసక్తి కలిగిన ఆమె తన 16 ఏటనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అలాగే అమ్మకి టాలెంట్ కూడా చాలా ఎక్కువ. స్లోవేనియన్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, ఇంగ్లీష్ భాషలలో ప్రావీణ్యం కలిగిన ఈమె 1998లో పార్టీలో అనుకోకుండా ట్రంప్ ను కలుసుకుంది. ఇక్కడ విషయమేమిటంటే తొలిచూపులోనే ట్రంప్ మరియు మెలానియా ఒకరినొకరు చూసుకొని ఫిదా అయిపోయారట.

 

ఇద్దరి మధ్య 24 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా ఏమీ పట్టించుకోకుండా సాన్నిహిత్యంగా ఉన్న వీరిద్దరి మధ్య ప్రేమ అంతకంతకు పెరుగుతూ వచ్చింది. చివరికి ఎలా అంటే ఇద్దరికీ ఒకరిపై ఒకరికి చచ్చేంతగా. ఇక మన ట్రంప్ మామూలోడు కాదుగా. చెప్పా పెట్టకుండా ఒక మంచి ముహూర్తం చూసుకుని మెలానియా చేతికి సడెన్ గా రింగ్ ను తొడిగేసి తన ప్రేమను వెల్లడించేశాడు. అలా 2005లో ఆమెకు ట్రంప్ తో ఆమెకు వివాహం అయింది.

 

అయితే అతనికన్నా అంత తక్కువ వయసున్న అందమైన యువతిని పెళ్లి చేసుకున్న ట్రంప్ మాత్రం అతని టెంపరితనం మరియు అమ్మాయిల వ్యవహారాలతో మెలానియాను చాలా ఇబ్బంది పెట్టాడు. కానీ ఆమె అతనిని చాలా సున్నితంగా ప్రేమతో డీల్ చేయడంతో ట్రంపు కూడా క్రమంగా మారుతూ వచ్చాడు. ఇప్పుడే ట్రంప్ ఇలా కొంచెం సామాజికంగా వ్యవహరిస్తున్నాడు అంటే అది మెలానియా ఘనతే. ఏదిఏమైనా ట్రంప్ లవ్ స్టోరీ తెలిసిన వారంతా నువ్వు మామూలు వాడివి కాదయ్యా స్వామి అని నోర్లు వెళ్ళబెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: