వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఒకపక్క ఎన్నికల సమయంలో మరియు ప్రజా సంకల్ప పాదయాత్ర టైంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ దూసుకుపోతున్నారు. మరోపక్క అదే సమయంలో గత ప్రభుత్వం చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి మొత్తం బయట పెట్టడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అమరావతి రాజధాని భూముల విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఎప్పటినుండో ఆరోపించడం జరిగింది. అదే తరుణంలో ఇటీవల తాజాగా ఈఎస్ఐ కుంభకోణం బయటపడటంతో ఈ రెండు కుంభకోణాల ఆరోపణల విషయంలో జగన్ ఏ విధంగా ముందుకు వెళ్తారో అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది.

 

అయితే బయటకు వస్తున్న ఆధారాలు మరియు వార్తలు బట్టి జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి గురించి చాలామంది వివిధ పార్టీల రాజకీయ నేతలు మరియు అనుభవం ఉన్నా అధికారులు కథలు కథలు గా చర్చించుకుంటున్నారు. రెడ్ హ్యాండెడ్ గా ఇలాంటి కుంభకోణాలలో నిందితులను పట్టుకోవాలని అనుకుంటే చాలా చాలా చాలా కష్టం జగన్ జీ అని కూడా కామెంట్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇటీవల sit ఏర్పాటు చేయటంతో కొన్ని విషయాలలో మాత్రం జగన్ కేసులను సాధించే అవకాశం ఉందని మరో పక్క కామెంట్ చేస్తున్నారు.

 

ఏది ఏమైనా విభజనతో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ప్రజాధనాన్ని చంద్రబాబు హయాంలో దోపిడీ దారులకు వెళ్లిన అవినీతి సొమ్మును ఎలాగైనా రాబట్టాలని జగన్ సర్కార్ ఫుల్ డిసైడ్ అయినట్లు ఆంధ్రప్రదేశ్ మీడియా వర్గాల్లో వార్తలు వినబడుతున్నాయి. అంతేకాకుండా బయటపడిన ప్రతి అవినీతి కార్యక్రమాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించడానికి కూడా జగన్ రెడీ అవుతున్నట్లు వైసీపీ పార్టీలో వార్తలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ సెషన్స్ లో రాజధాని భూ కుంభకోణం తాజాగా ఈఎస్ఐ కుంభకోణం గురించి ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఎల్ఈడి స్క్రీన్ పై వీడియో రూపంలో ఆధారాలతో సహా చూపించడానికి జగన్ రెడీ అవుతున్నట్లు సమాచారం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: