భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోసం ప్రభుత్వం కొన్ని వందల కోట్లు పెట్టి ఘనమైన ఏర్పాట్లు చేసింది. ట్రంప్, అతని భార్య మెలానియా మరియు కూతురు ఇవాంకాకు భారత సంప్రదాయాలు మరియు సంస్కృతి ని పరిచయం చేసిన మోడీ బృందం అడుగడుగునా మన దేశం విశిష్టతను వారికి తెలిసేలా ఎన్నో కార్యక్రమాలను మొదటి రోజు నుండే చేపట్టారు. తర్వాత అహ్మదాబాద్ లోని ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన మొతెరా స్టేడియం లో భారత దేశాన్ని మరియు భారతీయులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు.

 

స్టేడియం పూర్తిస్థాయిలో నిర్మాణం జరిగిన తర్వాత అందులో ఏర్పాటు చేసిన మొట్టమొదటి సభ ఇదే కావడం విశేషం. అయితే ట్రంప్ మాట్లాడుతూ ముందుగా భారతదేశం నుండి ఎంతో మంది గొప్ప క్రికెటర్లు వచ్చారని చెబుతూ క్రికెట్ దేవుడిగా భావించే సచిన్ టెండూల్కర్ ను 'సూచిన్' టెండూల్కర్ అని సంబోధించి దేశ ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొన్నాడు. ప్రపంచంలో సచిన్ గురించి తెలియని వారు ఉండకపోగా ట్రంప్ కు కనీసం పేరు పలకడం రాకపోవడం ఏంటి అని అతని నిర్లక్ష్యాన్ని అంతా ప్రశ్నిస్తున్నారు.

 

అలాగే స్వామి వివేకానంద యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ వివేకానంద పేరును కూడా పలకడం రాక ఖూని చేశాడు అమెరికా ప్రధాని. తర్వాత మోడీని చాయ్ వాలా అని సంబోధిస్తూ అదేదో నోటికి వచ్చిన పేరుని పలికాడు. అంతేకాకుండా కనీసం 'వేదాలు' అన్న చిన్న పదాన్ని కూడా తప్పుగా పలకడం చూసి భారతదేశానికి వచ్చి భారతీయుల గురించి మాట్లాడాలి అని భావిస్తే ఇటువంటి చిన్న చిన్న పదాలు స్పష్టంగా పలకడం నేర్చుకోవాలే కానీ ఇలా గొప్ప గొప్ప వారి పరువు తీస్తారా అని నెటిజన్లు అంతా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

 

ఇకపోతే సోషల్ మీడియాలో మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ట్రంప్ పర్యటనను వ్యతిరేకిస్తూ హ్యాష్ ట్యాగ్ లు భారీగా వచ్చాయి. గో బ్యాక్ ట్రంప్ అనే హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: