అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబం బస చేసిన హోటల్ చుట్టు పక్కల ఎంతటి సెక్యురిటిని మోహరించారో ఎవరికైనా తెలుసా ? మామూలు వాళ్ళైతే సెక్యురిటిని ఏమాత్రం ఊహించలేరు. అమెరికాలో అధ్యక్షుడి ఆఫీసుంటే వైట్ హౌస్, అధ్యక్షుడి ఇంటికి ఎంతటి భద్రత ఉంటుందో మనకు తెలీదు. కానీ ట్రంప్ భారత్ పర్యటనలో మాత్రం కనీవినీ ఎరుగని సెక్యురిటిని మోహరించటంతో చుట్టు పక్కల వాళ్ళలో ఒకవైపు భయం మరోవైపు ఉత్కంఠ పెరిగిపోయిందన్నది మాత్రం నిజం.

 

ఇంతకీ విషయంలోకి వస్తే  ఢిల్లీలోని హోటల్ మౌర్యా షెరాటన్ లో ట్రంప్ కుటుంబం సోమవారం రాత్రి బసచేసిన విషయం అందరికీ తెలిసిందే.  శతృవుల నుండి ఎటువంటి దాడులు జరగకుండా ముందు జాగ్రత్తగా విపరీతమైన సెక్యురిటిని ఏర్పాటు చేశారు. హోటల్ మొత్తం గడచిన రెండు మూడు రోజుల క్రితమే  అమెరికా సీక్రెట్ సర్వీసు రక్షణ అధికారులు, నేషనల్ సెక్యురిటి గార్డ్స్, ఎస్పిజీ ఉన్నతాధికారుల ఆధీనంలోకి వెళ్ళిపోయింది.

 

హోటల్లోని మొత్తం ఐదు ఫ్లోర్లు అమెరికాకు చెందిన కమెండోలు, షార్ప్ షూటర్లే ఆక్రమించుకున్నారు. హోటల్ తో పాటు చుట్టుపక్కల ఐదంచెల భద్రతను కల్పించారు. మొదటి రెండు అంచెల్లో అమెరికన్ సెక్యురిటి ఏజెన్సీ, ఎఫ్ బిఐ రక్షణ సిబ్బంది మాత్రమే ఉన్నారు. మూడో అంచె సెక్యురిటిలో భారత్ కు చెందిన నేషనల్ సెక్యురిటి గార్డ్స్ తో పాటు అమెరికా సీక్రెట్ సర్వీసు అధికారులున్నారు. హోట్లోలని లాబీలు, పార్కింగ్, స్విమ్మింగ్ పూల్ ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసు సెక్యురిటి ఉన్నతాధికారులు రక్షణగా నిలిచారు.

 

హోటల్లోని ఐదంతస్తుల్లోను నేషనల్ సెక్యురిటి గార్డులు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమెండోలు ఉన్నారు. భద్రతా కారణాల రీత్యా మొత్తం హోటల్ ను అమెరికా రక్షణ అధికారులే స్వాధీనం చేసేసుకున్నారు. ట్రంప్ వచ్చే ముందు రోజు అంటే శనివారం నుండి ఇతరులను ఎవరినీ లోపలకు రానీయలేదు. హోటల్లోని మొత్తం 438 గదులను ట్రంప్ సెక్యురిటినే తీసేసుకుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఐదంచెల భద్రతలో మొదటి రెండు అంచెల్లో అత్యంత అధునాత ఆయుధాలు కలిగిన అమెరికా రక్షణ అధికారులు మాత్రమే ఉన్నారు.

 

అలాగే,  హోటల్ చుట్టుపక్కల భవనాలపైన కమెండోలు, షార్ప్ షూటర్లు సుమారు 2 వేల మంది కాపలా కాస్తున్నారు. అంటే శనివారం ఉదయం నుండి సోమవారం రాత్రి ట్రంప్ అమెరికాకు బయలుదేరే వారకు ఈ సెక్యురిటి ఇలాగే కంటిన్యు అవుతుంది. మరి అగ్రరాజ్యం అమెరికానా మజాకానా ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: