కాంట్రవర్షియల్ దర్శకుడిగా మంచి గొప్ప పేరున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఈ  దర్శకుడి మాటలలో కాంట్రవర్సి... చేతలలో కాంట్రవర్సి... సినిమాలలో కాంట్రవర్సి... సోషల్ మీడియా పోస్టులలో కాంట్రవర్సి ... ఇలా ప్రతి విషయంలో కాంట్రవర్సి అందుకే. ఈ దర్శకుడు కేరాఫ్ కాంట్రవర్సీ. ఎప్పుడు ఎవరిపై  ఎలాంటి కామెంట్ చేస్తారో  ఎవ్వరికీ అర్థంకాని పరిస్థితి. ఎప్పుడు బోల్డ్ గా మాట్లాడుతూ... అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఉంటాడు రాంగోపాల్ వర్మ. తనదైన కామెంట్లతో ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది ఉంటాడు. ఇక తాజాగా కూడా మరోసారి సోషల్ మీడియాలో గత రెండు మూడు రోజుల నుండి వర్మ పేరు గట్టిగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. 

 

 

 భారత్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ పర్యటన నేపథ్యంలో కాంట్రవర్షియల్ డైరెక్టర్ గా పేరున్న రామ్ గోపాల్ వర్మ అమెరికా అధ్యక్షుడు పర్యటన సెటైర్లు వేస్తున్న  సంగతి తెలిసిందే. ఇప్పటికే రాంగోపాల్ వర్మ ట్రంప్  పర్యటన పై తన సోషల్ మీడియా ఖాతాలో  సెటైర్లు కూడా వేస్తారు. ఇక తాజాగా  సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియా పోస్ట్ లోకి  దర్శక ధీరుడు జక్కన్న ని కూడా లాగాడు. అయితే గ్రాఫిక్స్ మాయాజాలం ఉపయోగించి తన కోసం ఓ వీడియో చేయాల్సిందిగా రాజమౌళి ని ట్రంప్  రిక్వెస్ట్ చేయాలని రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా పంచ్ వేసాడు.

 

 

 లక్షల మందిని కోటి మంది గా చూపించే గ్రాఫిక్స్ వీడియో ని ట్రంప్ కు  రాజమౌలి గిఫ్ట్ గా ఇవ్వండి అంటూ  సెటైర్లు వేశాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా  పర్యటన సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వందల కోట్ల ఖర్చులపై విమర్శలు గుప్పించిన సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తనను  చూడడానికి లక్ష మంది వచ్చారో  కోటి మంది వచ్చారు లెక్క పెట్టుకొని మరి డోనాల్డ్ ట్రంప్ ప్రతీకారం తీర్చుకుంటాడు అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టాడు రాంగోపాల్ వర్మ. డోనాల్డ్ ట్రంప్ పర్యటన నేపథ్యంలో మురికివాడలు కనిపించకుండా ప్రధాని నరేంద్ర మోడీ కట్టిన గోడపై కూడా సెటైర్లు వేశాడు రాంగోపాల్ వర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: