ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్ పర్సన్ మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ టీ రామారావు భార్య లక్ష్మీపార్వతి మరొకసారి టిడిపి అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఆమె భర్త ఎన్టీఆర్ బ్రతికున్న రోజుల్లో చంద్రబాబు పై ఎలాంటి వ్యాఖ్యలు చేశారో రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుర్తుచేసుకున్నారు.

 

వైసిపి పార్టీ నేత లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్ చనిపోయిన రోజుల్లో చంద్రబాబు పైన తీవ్ర ఆగ్రహంతో ఉండేవారని.. మరియు అతను మళ్లీ అధికారంలోకి వస్తే చంద్రబాబుని తప్పకుండా అండమాన్ జైలు కి పంపిస్తానని శపథం చేసినట్లు లక్ష్మీపార్వతి గుర్తుచేసుకున్నారు. అయితే అది ఆయన బ్రతికి ఉండగా జరగలేదు కానీ చంద్రబాబు అతి త్వరలోనే జైలుకు వెళ్లే రోజు వస్తుందని ఆమె ఆశిస్తున్నట్లు కూడా తెలిపారు.

 

ఇకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత పాలనా కాలంలో జరిగిన అక్రమాలపై విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన సిట్ టీం ద్వారా అనేక వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పిన లక్ష్మీపార్వతి.. చంద్రబాబు అచ్చెన్నాయుడు మరియు సుజనాచౌదరి జైలు ఊచలు లెక్క పెట్టడం ఖాయమని చెప్పారు.

 

ఇకపోతే తెలుగు భాషకు పూర్వవైభవం తమ పార్టీ తీసుకుని వస్తుందని లక్ష్మీపార్వతి ఆశాభావం వ్యక్తం చేయగా తెలుగు సాహిత్య పీఠాన్ని విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేస్తామని కూడా చెప్పారు. తెలుగుతో పాటు ఇంగ్లీషుకు కూడా సీఎం జగన్ ప్రాధాన్యమిస్తున్నారని అన్నారు. ఇంగ్లీష్ తో పాటు తెలుగు ను కచ్చితంగా బోధించాలని ప్రైవేటు విద్యా సంస్థలకు ఆదేశాలిచినట్లు చెప్పారు. తెలుగు భాష అమ్మే.. కానీ.. అప్పుడప్పుడు కొన్ని మెళుకువలు పాటించాలని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: