తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇటీవల 'ప్రజా చైతన్య యాత్ర' స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యాత్రలో చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో కలకలం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ని అదేవిధంగా మంత్రులను టార్గెట్ చేస్తూ చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు పట్ల వైసిపి పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఏకంగా ఎవరు ఉపయోగించని పదజాలాన్ని ఉపయోగిస్తూ చంపేద్దాం, నరికేద్దాం మరియు ఫినిష్ చేద్దాం అని చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యల పట్ల వైసిపి పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది అని చెప్పుకునే చంద్రబాబు ఈవిధంగా మాట్లాడటం సమంజసం కాదని అంటున్నారు.

 

ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో మంత్రి కొడాలి నాని నీ వాడు వీడు అంటూ చంపేద్దామా అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు మాట్లాడటం పట్ల ఛీఫ్ విప్ గడికోట శ్రీకాంతరెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రజా చైతన్య యాత్రలకు స్పందన రాకపోవడంతో చంద్రబాబు పిచ్చెక్కి మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు.. చంద్రబాబు చేసేది 'ప్రజా చైతన్య యాత్ర' కాదు పచ్చి బూతుల యాత్ర. మద్యాన్ని ప్రోత్సహించే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. మద్యపాన నిషేధం చేయాలని గతంలో రామోజీరావు వార్తలు రాశారు.

 

రామోజీరావు ఇప్పుడు ఆ సంగతి ఎందుకు మర్చిపోయారో తెలియదు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే పాస్ పుస్తం కోసం రూ.లక్ష లంచం ఇచ్చానని ఓ రైతు చెప్పాడు. చంద్రబాబు హయాంలో రైతులు ఎంత ఇబ్బంది రైతు మాటల్లో తెలుస్తోంది. 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా కుప్పంలో మంచి నీటి సమస్యను చంద్రబాబు పరిష్కారం చేయలేక పోయారు.అని ఆయన అన్నారు. ఇదే తరుణంలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కుప్పంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని క్లారిటీ ఇచ్చారు. మొత్తం మీద చంద్రబాబు చేస్తుంది 'ప్రజా చైతన్య యాత్ర' కాదు 'బూతుల యాత్ర' అంటూ కొత్త పేరు పెట్టారు శ్రీకాంత్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: