ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ని మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నారని చాలా మంది రాష్ట్రంలో ఉన్న సీనియర్ రాజకీయ నేతలు కామెంట్ చేస్తున్నారు. చంద్రబాబులో ఎన్నడూ లేని విధంగా ఒక తెలియని భయం అభద్రతా భావం చాలా చక్కగా కనబడుతుంది అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. 2019 ఎన్నికల ఫలితాల నుండి చంద్రబాబుకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. అమరావతి రాజధాని ఇన్సైడర్ ట్రేడింగ్ విషయంలో ఇంకా అనేక విషయాలలో చంద్రబాబు ప్రభుత్వం అవినీతి మయం అయినట్లు జగన్ ప్రభుత్వం ఇటీవల గుర్తించడం జరిగింది. ఇప్పటికే అనేకసార్లు చంద్రబాబుని ఆధారాలతో సహా కొన్నిసార్లు పట్టుకున్న గాని న్యాయస్థానాలను మేనేజ్ చేసుకునే విధంగా వ్యవహరించడంతో చాలా వరకు తప్పించుకోవటం జరిగింది.

 

దీంతో జగన్ రాజకీయంగా చంద్రబాబుకి చాలా పెద్ద డ్యామేజ్ చేయాలని లాస్ట్ అండ్ ఫైనల్ అస్త్రంగా ఇటీవల 10 మంది సభ్యులతో కూడిన సిట్ ఏర్పాటు చేయటంతో చంద్రబాబు వెన్నులో వణుకు మొదలైనట్లు టిడిపి వర్గాలలో వార్తలు వినబడుతున్నాయి. ఇందుమూలంగా నే ఇటీవల చంద్రబాబు తలపెట్టిన ప్రజా చైతన్య యాత్ర లో చంద్రబాబు స్వరం పెరిగింది. మాట తీరు మారిపోయింది.

 

తెలియని భయం ఆయన మాటల్లో కనిపిస్తోంది అంటూ చాలామంది సీనియర్ నాయకులు అభివర్ణిస్తున్నారు. చాలా దారుణంగా ప్రజల మధ్య చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర లో మాట్లాడుతూ సిట్ ఎవరు వేయమన్నారు, సిట్ ఎందుకు వేశారు, ఎవరిని పడితే వారిని ఎలా ప్రశ్నిస్తారు అని బాబు అనడం చూస్తుంటే ఆయనలో తెలియని భయం చాలా చక్కగా కనబడుతుందని చాలామంది కామెంట్ చేస్తున్నారు. మరోపక్క జగన్ మాత్రం వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందే రాష్ట్రంలో తనకంటూ ప్రత్యర్థి నాయకుడు లేకుండా చకచకా ఎవరికి వారికి తన రాజకీయ వ్యూహాలతో చెక్ పెట్టబోతున్నట్లు వైసిపి పార్టీ వర్గాలలో టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: