టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విశాఖలో నిర్వహించ తలపెట్టిన ప్రజా చైతన్య యాత్ర కు ఆదిలోనే హంసపాదులా అనేక గండాలు ఎదురయ్యాయి. బాబు యాత్రను అడుగడుగునా ప్రజలు అడ్డుకోవడంతో చంద్రబాబు యాత్ర ముందుకు కొనసాగలేని పరిస్థితి నెలకొంది. తన పర్యటనపై ప్రజల నుంచి, వైసీపీ కార్యకర్తల నుంచి నిరసన వ్యక్తమవుతోందని ముందుగానే గ్రహించినా, ఈ స్థాయిలో వ్యతిరేకత ఉంటుందని చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు అంచనా వేయలేకపోయారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా చంద్రబాబు విశాఖ, విజయనగరం జిల్లాలో రెండు రోజుల పాటు ప్రజా చైతన్య యాత్ర చేపట్టాలని చూశారు. ఈ మేరకు విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న చంద్రబాబు వైసిపి కార్యకర్తలు, ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనిపై చంద్రబాబు తనదైన శైలిలో స్పందించారు.


 పోలీసులు తనను ఎన్ కౌంటర్ చేసినా వెనక్కి తగ్గేది లేదని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం తన యాత్రకు అడుగడుగునా అడ్డం పడుతుంటే దానికి పోలీసులు మద్దతు పలుకుతున్నారని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తన యాత్రకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని, ప్రస్తుతం విశాఖలో ఏర్పడిన గందరగోళ పరిస్థితికి, శాంతి భద్రతల వైఫల్యానికి పోలీసులు ఏ సమాధానం చెబుతారు అంటూ బాబు ప్రశ్నించారు. వైసిపి నాయకులు డబ్బులు ఇచ్చి ప్రజలను రెచ్చగొట్టి తన యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, మాపై కోడిగుడ్లు. చెప్పులు, రాళ్లు వేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు పోలీసులు ఎవరు తనను వెనక్కి వెళ్ళమనడానికి ..?  అసలు ఏ చట్టం కింద తమను వెనక్కు వెళ్ళమని చెబుతున్నారని మండిపడ్డారు. 

IHG


 తనను అరెస్టు చేయాలంటే నోటీసు ఇవ్వాలని, అలాగే ఎమ్మెల్యేలను ఇష్టం వచ్చినట్లుగా బెదిరించడం మంచి పద్ధతి కాదని చంద్రబాబు సూచించారు. తాను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశానని, తననే ఈ విధంగా అడ్డుకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ బాబు ప్రశ్నించారు. వైసీపీ నాయకులు భూములు కబ్జా చేస్తున్నారు, ప్రశాంతంగా నగరాన్ని అశాంతికి నిలయంగా మారుస్తున్నారు అంటూ చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తమ యాత్రను ఎంతగా అడ్డుకోవాలని చూసినా... తాము వెనక్కి తగ్గేది లేదని, ఈ విషయంలో ఎంత వరకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామంటూ చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇక వైసీపీ కూడా చంద్రబాబు యాత్రను ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్లకుండా చేయాలనే పట్టుదలతో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: