నిన్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ జరగబోయే పరీక్షల విషయం పై మాట్లాడుతూ…. మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయని, మార్చి 4 నుంచి 23 వరకు ఇంటర్‌ పరీక్షలు జరగనున్నాయని చెప్పారు. అయితే రెండు పరీక్షలు ఏక కాలంలో నిర్వహించనుండడంతో…. ఇన్విజిలేషన్ విధులను నిర్వహించేందుకు సరిపడా ఉపాధ్యాయులు అందుబాటులో లేని పక్షంలో గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులను ఇన్విజిలేటర్లుగా నియమించనున్నారని చెప్పారు.  ప్రకటనతో, ఒక్కసారిగా అందరూ అవాక్కయ్యారు. ప్రకటన, లైవ్ లో చూసి విన్న వారు, ఇదేమీ నిర్ణయం అంటూ, ఒకేసారి షాక్ కు గురయ్యారు.

 

అయితే ఇప్పటికే మంత్రి ఆదిమూలపు సురేష్ జరగబోయే పరీక్షలు విషయం గురించి సచివాలయ ఉద్యోగులకు ఇన్విటేషన్ బాధ్యతలను అప్పగించే విషయం పై చేసిన వ్యాఖ్యల పట్ల ఎంతో మంది విమర్శలు చేస్తున్నారు. విద్యార్థుల జీవితంలోని అతి కీలకమైన టెన్త్ మరియు ఇంటర్ పరీక్షల సమయంలో బాగా ట్రైనింగ్ తీసుకున్న ఉపాధ్యాయులే అప్పుడప్పుడు పరీక్ష విధానం, ఓఎంఆర్ షీట్లు మరియు పేపర్ టాలీ లాంటి విషయాలలో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. అలాంటిది అనుభవం లేని సచివాలయ ఉద్యోగులు వెళ్తే పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. అదే కాకుండా పరీక్షలు రాసే సమయంలో ఇన్విజిలేటర్లు ప్రవర్తన పిల్లల పరీక్ష పై ప్రభావం చూపుతుందని కూడా వారు చెబుతున్నారు.

 

ఇదిలా ఉండగా సచివాలయ ఉద్యోగులు తమకు నెలకు ఇచ్చే 15 వేల రూపాయల జీతానికి పని తాము చేయలేమని ప్రభుత్వానికి తెలిపినట్లు సమాచారం. తమ సొంత ఖర్చు పెట్టుకొని ఎగ్జామ్ సెంటర్ కు వెళ్ళలేమని…. ఇంకా  మామూలు ప్రభుత్వ ఉపాధ్యాయులకు న్విజిలేషన్ కు ఇచ్చే మొత్తంతో పాటు వారి రవాణా మరియు తిండికి ఇచ్చే ఎలోవెన్స్ తమకు కూడా ఇవ్వాలని కోరారట. ప్రభుత్వం కూడా రెండు పరీక్షలు ఏకకాలంలో నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అందుకు సముఖంగా ఉన్నట్లే తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: