మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి అని మనదేశ ప్రభుత్వాలు ఎంతగా తాపత్రయ పడుతున్నాయో అన్న విషయం ఎవరికి అర్ధం కావడం లేదు.. వారికోసం ఎన్నో పధకాలను ప్రవేశ పెడుతున్నారు.. ఇంకా ప్రతి రంగంలో వారిని ముందు ఉంచేలా ప్రణాళికలు రచిస్తున్నారు.. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం మద్యం తాగే అలవాటున్న మహిళలకు ఓ శుభవార్త వినిపించింది.

 

 

అదేమంటే.. మహిళలు మద్యం కొనేందుకు ఇకపై ఇబ్బందులు పడాల్సిన పని లేదట. వారికి కావాల్సిన బ్రాండ్ ను చక్కగా కొనుక్కోవచ్చునట. ఎలాగంటే, మహిళల కోసం ప్రత్యేకంగా మద్యం షాపులు ఏర్పాటు చేసే దిశగా  కమల్ నాథ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా త్వరలో ఉమెన్ ఫ్రెండ్లీ లిక్కర్ షాపులు ఏర్పాటు చేసి మద్యం కొనేందుకు మహిళలకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు లేకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రత్యేకంగా లేడీస్ కోసం ఏర్పాటు చేసే ఈ లిక్కర్ షాపుల్లో హై ఎండ్ ఫారిన్ లిక్కర్ బ్రాండ్స్ మాత్రమే అమ్ముతారట...

 

 

ముందుగా భోపాల్, ఇండోర్ లో ఎక్స్ క్ల్యూజివ్ గా రెండు లిక్కర్ షాపులు.. జబల్ పూర్, గ్వాలియర్ లో చెరో లిక్కర్ షాప్ ఏర్పాటు చేయనున్నారు. చూసారుగా మహిళల కోసం మద్యం షాపులు.. ఇప్పటివరకు మగవారే బహిరంగంగ మద్యం కొనుక్కుని తాగే వారు.. ఇకనుండి మహిళలు కూడా ఇలా మద్యం కొనుగోలు చేసి మగవారికి తామేమి తీసిపోమని, మీరు తాగుబోతులైతే, మేము కూడా మీకన్న ఎందులో తక్కువ.. మేముకూడ తాగి ఊగుతామంటు చాలెంజ్ చేయండి అని అంటున్నారు ఈ విషయం తెలిసినవారు..

 

 

ఇప్పటికే మగవారు తాగితే తట్టుకోలేకుండా ఉంటుంది.. ఇకనుండి ఉమెన్ ఫ్రెండ్లీ లిక్కర్ షాపుల పుణ్యమా అని అన్ని సంసారాలు.. తాగుబోతుల కాపురాలతో నిండు నూరేళ్లూ గొడవలతో, కొట్లాటలతో వర్ధిల్లుతాయి.. ఇక ఈ పధకాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తే మహిళలకు దొంగచాటుగా మద్యం కొనుకున్నే బాధ తప్పుతుంది.. ప్రభుత్వానికి అధిక ఆదాయం కూడ వస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: