అనాదిగా వస్తున్న ఆధిపత్య పోరులో ఎందరో అమాయకులు బలి అవుతూనే ఉన్నారు.. ఒకప్పుడు రాజ్యాల కోసం యుద్ధాలు చేసేవారు.. ఇప్పుడు ఆధిపత్యం కోసం అమాయకులైన ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు.. ఇదిగో ఇలానే చేయబోయిన చైనా ప్లాన్ బెడిసికొట్టగా తమ దేశప్రజల ప్రాణాలే ప్రమాదంలో పడ్దాయి.. ఒక తమ దేశమే కాకుండా ప్రపంచ దేశాల దృష్టిలో చైనా ఒక మాయని మచ్చలా మిగిలిపోతుంది.. ఇకపోతే చైనాలో పుట్టి.. ఆ దేశంతో పాటుగా ప్రపంచ దేశాల్లో అతిభయంకరంగా మారిన కరోనా వైరస్ అతి వేగంగా ఇప్పటి వరకు సుమారుగా 50 దేశాలకు వ్యాపించిందట. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన చెందుతోంది.

 

 

ఇదే కాకుండా కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొడానికి చర్యలు చేపట్టాలని పదే పదే డబ్ల్యూహెచ్‌ఓ అన్ని దేశాలకు విజ్ఞప్తి కూడ చేస్తోంది. ఇకపోతే ఈ కరోనా వైరస్‌ వల్ల గురువారం మరో 44 మంది ప్రాణాలు కోల్పోయినట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. అలాగే మరో 327 కొత్త కేసులు నమోదయ్యాయట. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల చైనాలో మొత్తం 2,788 మృతి చెందగా, బాధితుల సంఖ్య 78,824కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 83,000 దాటగా, మరణాల సంఖ్య కూడా 2,858కి చేరుకుంది.

 

 

ఇక మిగతా దేశాలైన దక్షిణ కొరియాలో గురువారం మరో 256 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో అక్కడ బాధితుల సంఖ్య 2,022 దాటిందట. ఇదే కాకుండా అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియా మహిళకు కరోనా వైరస్ ఉన్నట్టు నిర్దారణ కావడంతో ఆమె ఆచూకీ కోసం ఆరోగ్య శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.. ఇక ఇప్పటికే ఈ వ్యాధి ఇరాన్‌లో కూడా వ్యాపించిందన్న విషయం కూడా తెలిసిందే.. ఇకపోతే ఏం ఫలితం ఆశించి చైనా ఇంత దారుణమైనా వ్యాధిని బయటకు విడుదల చేసిందో తెలియదు గాని.. చైనా చేసిన తప్పువల్ల ప్రపంచం శ్మశానంలా మారుతుంది.. ఇప్పుడే ఇలా ఉంటే, ఇక ముందు ముందు ఇలాంటి దారుణాలు ఎన్ని చూడవలసి వస్తుందో అని అనుకుంటున్నారట ప్రజలు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: