చదువు మనిషికి ఎంతో విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది. చదువు మనిషిలోని మేధస్సును పెంచుతుంది. ప్రతి మనిషికి జ్ఞానం పెంపొందాలంటే చదువు తప్పనిసరి. కానీ నేటి తరం చదువులు  మాత్రం విద్యార్థులకు భారంగానే మారుతున్నాయి. ఎందుకొ  ఒకప్పటిలా నేటి తరం విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టడం లేదు. రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతుండడం చదువులో కూడా ఆధునిక పోకడలు వస్తున్నప్పటికీ విద్యార్థులు మాత్రం రోజురోజుకూ చదువుపై ఆసక్తిని కోల్పోతారు. ఎప్పుడు చదువుని నిర్లక్ష్యం చేద్దామా అని చూస్తున్నారు.ఈ రోజుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఇలాగే కనిపిస్తున్నారు. 

 

 

 

 అదే చదువుపై ఆసక్తి లేకపోవడం లేదా చదివినా సరైన ఫలితాలు రాలేదని మనస్థాపంతో చెందడం, స్కూల్ కి వెళ్ళాలి అంటూ తల్లిదండ్రులు మందలించడం, సరిగ్గా చదవాలంటూ ఉపాధ్యాయులు హెచ్చరించడం ఇలా కారణం ఏదైనా విద్యార్థులు మాత్రం బలవన్మరణాలకు పాల్పడుతున్నారు ఈ రోజుల్లో. చిన్నచిన్న కారణాలకే విద్యార్థులు ఏకంగా ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు. ఇక తాజాగా చిత్తూరు జిల్లాలో ఇలాంటి విషాద ఘటన జరిగింది. స్కూలుకు వెళ్లడం లేదని తల్లిదండ్రులు మందలించినందుకు ఓ పదో తరగతి విద్యార్థి తీవ్ర మనస్తాపం చెందాడు. దీంతో అంత చిన్న వయసులోనే.. అతిగా ఆలోచించి... ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. ఇక అనుకున్నదే తడవుగా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆ విద్యార్థి. 

 

 

 గంగవరం మండలం పత్తికొండ గ్రామానికి చెందిన సుధీర్ పదవ తరగతి చదువుతున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా సుధీర్ స్కూల్ కి సక్రమంగా వెళ్లడం లేదు చదువులో కూడా పూర్తిగా వెనుకబడి పోయాడు. తల్లిదండ్రులు ఎంత నచ్చజెప్పినా సుధీర్ మాత్రం స్కూల్కి సరిగ్గా వెళ్ళడం లేదు. ఈ క్రమంలోనే గురువారం స్కూల్కు వెళ్లాలంటూ  తల్లిదండ్రులు సుధీర్ ను  కాస్త మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుధీర్ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఎవరూ లేని సమయంలో తమ పాఠశాల సమీపంలో ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయాడు. ఇక సుదీర్ మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఉరికొయ్యకు నిర్జీవంగా వేలాడుతున్న అతడి మృతదేహాన్ని చూసి స్కూల్ విద్యార్థులు కూడా తీవ్ర భయబ్రాంతులకు లోనయ్యారు. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: