తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్ గిరి  ఎంపీ రేవంత్ రెడ్డి కి ఒక ప్రత్యేక స్థానం ఉన్న విషయం తెలిసిందే. తనదైన ప్రసంగాలతో ప్రజలందరినీ హోరెత్తించ గల సత్తా రేవంత్ రెడ్డి సొంతం. అధికార పక్షాన్ని సైతం హడలించేలా విమర్శలు చేయగలడు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో కీలక నేతగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డికి తెలంగాణ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు. ఇతర పార్టీల నేతలు కూడా రేవంత్ రెడ్డి అంటే ఎనలేని అభిమానంని చూపిస్తూ ఉంటారు. అందుకే రేవంత్ రెడ్డికి తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటి వరకు ఎన్నో సార్లు అధికార పార్టీ తీరును ఎండగడుతూ తనదైన శైలిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రసంగం చేస్తున్నారు అంటే ప్రజలందరూ హోరెత్తిపోతు ఉంటారు. అలా ఉంటాయి మల్కాజ్గిరి ఎంపీ కాంగ్రెస్ కీలక నేత రేవంత్ రెడ్డి ప్రసంగాలు. 

 

 

 

 అయితే తాజాగా తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత అయిన రేవంత్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా గళమెత్తేందుకు  సిద్ధమవుతున్నారా... ఇప్పటి వరకు ఆంధ్ర రాజకీయాలపై ఎప్పుడూ స్పందించని రేవంత్ రెడ్డి తాజాగా... విజయవాడ వేదికగా జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించ పోతున్నారా... అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే రేపు విజయవాడలో జరగనున్న అమరావతి పరిరక్షణ సమితి నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశానికి తెలంగాణాకు చెందిన ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి హాజరు కానున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి సర్కారుపై మల్కాజ్గిరి ఎంపీ తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత విమర్శలు గుప్పించనున్నారు అనే అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 

 

 

 

 అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానిల ప్రకటన చేసినప్పటి నుంచి రైతులు విపక్ష పార్టీలు ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి తెలంగాణ ఎంపీ రేవంత్ రెడ్డి హాజరు కానున్నారని వార్తలు కూడా ఊపందుకున్నాయి. ఒకవేళ వార్తలు నిజమై రేవంత్ రెడ్డి నిజంగా రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై  రేవంత్  ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించి అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ నేతలు జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో హాజరై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాదిరిగానే జగన్ సర్కార్ పై విమర్శలు చేయనున్నారని ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. ఓ వైపు కేసీఆర్ తో  పాటు మరోవైపు జగన్ ను కూడా రేవంత్ రెడ్డి విమర్శించనున్నట్లు  తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: