ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్ పరిపాలన అధికారులకు పరుగులు పెడుతున్నాయి. ఒకపక్క ప్రభుత్వం నుండి ప్రజలకు వెళ్లే ప్రతి సంక్షేమ పథకాల విషయంలో ఎక్కడా కూడా వివక్షత చూపించకూడదని మంత్రులకు, ఎమ్మెల్యేలకు అదేవిధంగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు జగన్ తెలపడం జరిగింది. ఒకపక్క సంక్షేమాన్ని మరోపక్క అభివృద్ధిని చేసుకుంటూ పోతున్న వైయస్ జగన్ తాజాగా రాష్ట్రానికి సంబంధించి కీలక ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు పై ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఇటీవల ఢిల్లీ పర్యటన చేపట్టిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో వేగవంతమైన చర్యలు స్టార్ట్ అయ్యాయి.

 

ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన వైఎస్ జగన్ అక్కడ ఉన్న అధికారులను ఉద్దేశించి పనులలో ఏమాత్రం తేడా జరిగినా ఆలస్యమైనా ఊరుకునే ప్రసక్తి లేదని గట్టిగా జగన్ తెలపడంతో వాళ్ల గుండెల్లో రైలు పరిగెత్తినట్టు అయిందని 16 నెలలో పోలవరం పూర్తి అయిపోవాలి అని గట్టిగా సంబంధిత అధికారులకు డెడ్ లైన్ జగన్ విధించారట. దీంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల బట్టి ప్రాజెక్టు పనులు బట్టి చూస్తే రాబోయే ఏడాది వర్షాకాలం రాకముందే పోలవరం పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని అలా జరగాలంటే ప్రస్తుతం ఈ ఏడాది జూన్ నాటికి స్పిల్‌వే నిర్మాణం పూర్తి కావాలి.

 

అలాగే... కాఫర్‌ డ్యాంలో ఖాళీలు పూర్తి చెయ్యాలి. నది ప్రవాహాన్ని స్పిల్‌వే మీదుగా మళ్లించి ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యాంను పూర్తిచేయాలి. అంటే ఒకే సమయంలో... స్పిల్‌వే, కాఫర్‌ డ్యాం నిర్మాణాలు కూడా పూర్తవ్వాల్సి ఉంటుంది. మరి ఈ పనులన్నీ పూర్తి చేయగలిగితే 16 నెలల సమయంలోనే ఈ ప్రాజెక్టు పూర్తి అవడం గ్యారెంటీ అనే వార్తలు బలంగా వినబడుతున్నాయి. మరియు అదే విధంగా పోలవరం ముంపు ప్రాంత బాధితులకు పునరావాస కాలనీల నిర్మాణాలకు కూడా జగన్ ప్రణాళికలు వేస్తున్నట్లు ప్రభుత్వం నుండి అందుతున్న సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: