నేటి రోజుల్లో కుక్కలు మానవులకు ప్రేమించదగిన చిన్నపాటి జీవులే కాదు...అవి ఇళ్ళల్లో భాగస్వాములుగా, పిల్లలుగా, తోడబుట్టినవారిగా, ఆప్త మిత్రులుగా చెలామణి అయిపోతున్నాయి. ఇలా కుక్క‌ల‌ను ఇంట్లో వాళ్లతో సమానంగా ప్రేమించేవాళ్లు చాలామందే ఉంటారు. వాస్త‌వానికి కుక్క మనిషికి ఉత్తమ స్నేహితుడు అని చెప్పవచ్చు. అలాగే విశ్వాసానికి మారుపేరుగా శునకాలను పిలుస్తారు. అవి యజమాని పట్ల ఎంతో విశ్వాసంగా.. ప్రేమగా ఉంటాయి. ఇంటికి రేయింబవళ్లు గస్తీ కాస్తాయి. అవసరమైతే యజమాని కోసం ప్రాణాలును సైతం అర్పిస్తాయి. అందుకే అవంటే చాలా మందికి ఎంతో ఇష్టం. ఇంకొందరికి ప్రాణం కూడా. మ‌రియు ప్రతి రోజు మీ కుక్క పిల్లతో ఆడుతూ రోజువారీ ఆందోళనల నుండి ఉపశమనం పొందవచ్చు.


 
కాప‌లా.. కాల‌క్షేపం.. స‌ర‌దా.. హోదా.. ఆత్మీయ‌త‌.. ఒంట‌రిత‌నం.. ఇలా కార‌ణాలేమైనా మ‌నిషి జీవ‌న గ‌మ‌నంలో శున‌కాలు భ‌గ‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే వాటికోసం ఏమైనా చేయడానికి వెన‌కాడ‌రు. ఇదే తరహాలో కుక్కను పెంచుకున్న జావ‌న్‌.. కుక్కను ప్రమాదం నుంచి కాపాడబోయి తానే ప్రాణాలు కోల్కోయాడు. మంటల్లో చిక్కుకున్న తన పెంపుడు కుక్కను రక్షించే క్రమంలో ఓ ఆర్మీ అధికారి దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు.  జమ్మూకశ్మీర్‌లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఈ దారుణం జరిగింది. గుల్‌మార్గ్ ప్రాంతంలోని ఆర్మీ అధికారి నివాసంలో మంటలు చెలరేగాయి.

 

వెంటనే రంగంలోకి దూకిన మేజర్ అంకిత్ బుధ్‌రాజా..మంటల్లో చిక్కుకున్న తన భార్యాను, పెంపుడు కుక్క కాపాడారు. అయితే మరో కుక్కు కూడా రక్షించేందుకు తిరిగి ఇంట్లోకి ప్రవేశించిన అధికారి.. అగ్నిజ్వాలలకు బలైయ్యారు. మంటల కారణంగా 90 శాతం గాయాలపాలైన అత‌డు.. ఘటనా స్థలంలోనే మృతి చెందారు. అంకిత్ మృత దేహాన్ని అధికారులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇలా త‌న పెంపుడు కుక్క‌ను కాపాడ‌బోయి తానే మంట‌ల‌కు ఆహుతి అయిపోయాడు. దీంతో ఆర్మీ అధికారి కుటుంబం స‌భ్యులు శోక‌సంద్రంలో మునిగిపోయాడు.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: