ప్రపంచ దేశాలను  ప్రాణభయంతో వణికిస్తున్న వైరస్ కరోనా . ఇప్పటికీ వైరస్ ప్రపంచ దేశాలకు శరవేగంగా వృద్ధి చెందుతూ అందరిని ప్రాణభయంతో వణికిస్తోంది. వైరస్ రాకుండా ఉండేందుకు ఎక్కువగా మాస్క్ లు  వాడుతున్నారు. మాస్క్ లు  వాడినప్పటికీ ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని చెబుతున్నారు వైద్యులు. మాస్క్ లు వాడటం ద్వారా కేవలం నోరు ముక్కు ద్వారా మాత్రమే బాడీ లోకి వైరస్ వెళ్లకుండా ఉంటుందని.. కానీ కళ్ల ద్వారా చేతుల  వైరస్ సోకుతుంది  అని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా చేతులు సరిగా శుభ్రం చేసుకోకపోవడం ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని చెపుతున్నారు.

 

 

 ఎక్కడెక్కడో ముట్టుకున్న చేతులను నోట్లో పెట్టుకోవడం ద్వారా బాడీ లోకి కరోనా  వైరస్ వెళ్తుందని  సూచిస్తున్నారు వైద్యులు. చేతులను శుభ్రంగా ఉంచుకుని కనీస జాగ్రత్తలు పాటిస్తే కరోనా  వైరస్ బారిన పడకుండా ఉండొచ్చని చెబుతున్నారు. అయితే చేతులను సబ్బుతో కడుక్కోవటం అనేది కరోనా పై గొప్ప ఆయుధం అని అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శాస్త్రవేత్త కారెన్  ఫ్లెమింగ్ తెలిపారు. 

 

 

 చేతులు కడుక్కోవడం అంటే ఏదో పైన పైన  కడుక్కుని ఉరుకుంటే  సరిపోదు... బాగా సబ్బు పెట్టుకొని చేతులు కడుక్కోవాల్సి  ఉంటుందని సూచిస్తున్నారు. ముఖ్యంగా కరోనా  వైరస్ రాకుండా ఉండేందుకు 5 సూత్రాలు పాటించాలి అని చెబుతున్నారు వైద్యులు. సింక్ లో  చేతులు కడుగుతున్నప్పుడు ముందుగా చేతులు కలిపి ఆ తర్వాత సబ్బును  చేతులకు అంటించాలని... ఆ తర్వాత సబ్బు నురగ చేతులకు వెనక ముందు రెండు చేతులు అంటుకునేలా చేయాలి అంటూ సూచిస్తున్నారు వైద్యులు. వేళ్ళ మధ్యలో గొల్ల కింద లోపల మూల కూడా చేయాలంటున్నారు.

 

 

 

ఇక సబ్బులు అందించిన అనంతరం బాగా రుద్దాలని...20 సెకన్ల పాటు ఇలా కడగాలి అని   సూచిస్తున్నారు. అనంతరం శుభ్రంగా ఉన్న టవల్ తో చేతులను తుడ్చుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు కరోనా  వైరస్ కు మందు కనిపెట్టే పనిలో నిమగ్నమైన సమయంలో... ఈ మందును కనిపెట్టేంతవరకు ముందు జాగ్రత్త చర్యగా ప్రతి రోజు ఏ పని చేసేటప్పుడు అయిన  చేతులను సబ్బుతో శుభ్రంగా ఉండేందుకు అవకాశం ఉంది అని సూచిస్తున్నారు. అయితే ఇలా సబ్బుతో చేతులు కడుక్కోవడం కేవలం కరోనా  వైరస్ కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇలా చేతులు కడుక్కోవడం ఎంతో మేలు.

మరింత సమాచారం తెలుసుకోండి: