ఈ నెలలో ప్రజలకు బ్యాంకులు భారీ షాకివ్వనున్నాయి. మొత్తం 9రోజులు.. బ్యాంకులు మూతపడనున్నాయి. ఆన్‌లైన్‌ సేవలకు ఎలాంటి అంతరాయం ఏర్పడకున్నా.. రోజూవారి లావాదేవీలు చేసేవారికి తిప్పలు తప్పేలా లేవు. ఈ ప్రభావం ఏటీఎంలపైనా పడే అవకాశం ఉంది. 

 

పబ్లిక్‌ హాలీడేస్‌... రెగ్యులర్‌ వారాంతపు సెలవులు.. మొత్తానికి మార్చి నెలలో బ్యాంకులకు సెలవులే సెలవులు. 31 రోజుల మార్చి నెలలో... ఏకంగా 9 రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో, బ్యాంకింగ్‌ సేవలకు తీవ్ర అంతరాయం కలగనుంది. 

 

ఈనెల 8, 15, 22, 29 తేదీల్లో ఆదివారం సెలవులు కాగా.. 14, 28 తేదీల్లో వరసగా రెండు, నాలుగో శనివారాల కారణంగా బ్యాంకులు మూతపడనున్నాయి. అదనంగా 10వ తేదీ హోలీ, 25న ఉగాది హాలిడేస్‌ ఉన్నాయి. ఇక, ఫైనాన్షియల్‌ ఇయర్‌ ఎండింగ్‌ అయిన మార్చి 31న బ్యాంక్‌ సేవలు అసలే అందుబాటులో ఉండవు. ఇలా మొత్తంగా ఈ నెలలో 9రోజుల పాటు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవన్నమాట. 

 

ఆన్‌లైన్‌ సేవలకు మాత్రం ఎలాంటి ఆటంకం ఉండకపోవచ్చు. కానీ, రెగ్యులర్‌గా బ్యాంకింగ్‌ లావాదేవీలు జరిపే ఖాతాదారులు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిందే. బ్యాంకులకు వరుస సెలవులు, సమ్మె ప్రభావం ఏటీఎంలపై కూడా పడనుంది. సాధారణంగా సెలవులకు ముందు రోజుల్లోనే ఏటీఎంల్లో సరిపడా మొత్తాన్ని స్టోర్‌ చేసేస్తాయి బ్యాంకులు. అయితే, ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. సో.. బ్యాంకు లావాదేవీల మీద ఆధారపడే చిన్నాచితక వ్యాపారులు అలర్ట్‌గా ఉండాలి. 

 

మొత్తానికి బ్యాంకులు వినియోగదారులకు భారీగా షాక్ ఇస్తున్నాయి. వరుసగా పండుగలు, ఆదివారాలు, సెలవులు వస్తుండటంతో బ్యాంకులు మూతపడనున్నాయి. ఆన్ లైన్ ట్రాన్ శాక్షన్ చేసే వారికి కొంత ఊరట లభించినా.. ఏటీఎంలలో నగదు తీసుకునే వారి ఇబ్బందులు తప్పేలా లేవు. ఇది బ్యాంక్ వినియోగదారులకు పెద్ద షాకే అనిచెప్పాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: