దేశంలోని వివిధ రాష్ట్రాలలో భూగర్భ జలాలను పెంపొందించేందుకు... కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అటల్ భుజల్  యోజన పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకం విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బిగ్ షాక్ తగిలింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటల్ భుజల్  యోజన పథకం కింద ఎంపిక చేసిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు అంటూ కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి రతన్ లాల్  కటారియా  వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యులు ఆయన విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు గాను... కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి రతన్ లాల్  కటారియా ... ఈ విషయాన్ని రాతపూర్వకంగా జవాబిస్తూ వెల్లడించారు. 

 

 

 ప్రజల భాగస్వామ్యంతో భూగర్భ జలాల నిర్వహణ కోసం... అటల్ భూజల్  యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కేంద్ర జల  శక్తి సహాయమంత్రి రతన్ లాల్  కటారియా  రాజ్య సభ వేదికగా చెప్పుకొచ్చారు. అయితే ఈ పథకం నిర్వహణ కోసం ఆరు వేల కోట్ల రూపాయల ఖర్చు చేసేందుకు  కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు మంత్రి చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అటల్ భుజల్  యోజన పథకం కోసం ఖర్చు పెడుతున్న ఆరు వేల కోట్ల లో... సగం వాటాను ప్రపంచ ఆర్థిక బ్యాంకు సాయంగా అందిస్తుందని మిగిలిన సగం వాటాను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది అంటూ ఆయన తెలిపారు. 

 

 

 2020-21 నుంచి 2024 -25 వరకు ఈ పథకం కొనసాగుతుంది అంటూ తెలిపారు కేంద్ర జల శక్తి సహాయ మంత్రి రతన్ లాల్  కటారియా వెల్లడించారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అటల్ భుజల్  యోజన పథకం కింద కేవలం కొన్ని రాష్ట్రాలను మాత్రమే ఎంపిక చేశామని తెలిపారు. ఈ పథకం కింద ఎంపిక చేసిన రాష్ట్రాలలో గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్మహారాష్ట్రరాజస్థాన్ఉత్తర ప్రదేశ్ వంటి 7 రాష్ట్రాలలోని 78 జిల్లాలలో విస్తరించి ఉన్న 8383 గ్రామ పంచాయితీలో.. అటల్ భుజల్  యోజన పథకాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది అంటూ రాజ్య సభ వేదికగా జల శక్తి శాఖ సహాయ మంత్రి రతన్ లాల్  కటారియా  వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: