మన దేశంలో ఏదైనా దారుణం ఉంది అంటే అది ఇదే.. ఏంటి అది అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా... తిండి లేక జనాలు చచ్చే దేశం మనది.. కానీ అదే దేశంలో ఒక పెళ్లికి 600 నుండి 1000 కోట్లు ఖర్చు పెట్టే దేశం కూడా మనదే.. అంటే అన్నారు అంటారు కానీ.. ఒక పెళ్లి ఎంత ఆడంబరంగా చేసిన మహా అయితే కోటి నుండి 100 కోట్లు అవుతుంది. 

 

కానీ ఇక్కడ అలా కాదు.. కోటి రూపాయలతో పెళ్లి చెయ్యడానికి నేను ఏమైనా మధ్యతరగతి వాడినా? నేను ఎంత సంపాదించా? అంత నా ముద్దుల పిల్లల కోసమే కదా! ఆ మాత్రం ఖర్చు పెట్టకూడదా ఏంటి? అని అనుకుంటారో ఏమో.. వందల కోట్లు ఒక్క పెళ్లికి ఖర్చు పెట్టి కొద్ది రోజులు వార్తల్లో సంచలనం సృష్టిస్తారు. 

 

ఇంకా ఆ సమయంలో ఆ భారీస్థాయి పెళ్లి చుసిన నెటిజన్లు ఇలా కామెంట్లు పెడుతారు.. ''ఇంత ఖర్చుతో ఒక్క పెళ్లి జరపడం అవసరమా? మీరు ఒక్క పెళ్లికి ఖర్చు పెట్టే డబ్బుతో ఎంతోమంది పేదల ఆకలి తీర్చచ్చు.. ఇండియాలో ఏవో కొన్ని ప్రాంతాలనైనా డెవలప్ చెయ్యచ్చు.. మీకు అర్థం అవుతుందా? అని కామెంట్స్ పెడుతారు!

 

ఆ కామెంట్స్ కి కొందరు స్పందించి.. అదేంటయ్యా.. ఎవరి పెళ్లి వాళ్ళ ఇష్టం.. వాళ్ళకు డబ్బు ఉంది వాళ్ళు ఖర్చు పెడుతున్నారు.. మధ్యలో నీకు ఏమైంది? అయినా పేదలకు.. పెళ్లికి లింక్ పెడుతారు ఏంటి? వాళ్ళు నువ్వు చెప్పావ్ అని ఏమైనా ఆడంబరాలు తగ్గిస్తారా ఏంది? అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏది ఏమైనప్పటికి.. ఒక్క పెళ్ళికి అంత ఖర్చు అవసరమా? అనే ప్రశ్నలు ప్రముఖుల పెళ్లిళ్లు జరిగిన ప్రతిసారి వినిపిస్తున్నాయి అన్న సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: