తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే సవాలక్ష సమస్యలతో సతమతం అవుతున్న కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఇప్పట్లో సర్దుమణిగేలా కనిపించడంలేదు. గ్రూపు రాజకీయాలతో సతమతం అవుతున్న కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకంటే నాయకులే పార్టీని మరింతగా దెబ్బతీస్తున్నారు. దీంతో కొంతమంది కాంగ్రెస్ నాయకుల్లో భవిష్యత్తుపై ఆందోళన రేకెత్తుతోంది. ఇప్పటి వరకు పరిస్థితులు చక్కబడతాయి అని ఎదురు చూసినా పరిస్థితుల్లో మార్పు వచ్చేలా కనిపించకపోవడంతో పార్టీ మారేందుకు చాలామంది సిద్ధమవుతున్నారు. అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు టిఆర్ఎస్ లో చేరతారనే ప్రచారం జరుగుతోంది.

IHG


 ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని 13 నియోజకవర్గాల్లో 12 టిఆర్ఎస్ గెలుచుకుంటే ఒక్క మంథాని లో మాత్రం శ్రీధర్ బాబు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక ఎన్నికల ఫలితాలు తర్వాత నుంచి రాజకీయంగా, అభివృద్ధి పరంగా ఎన్నో ఇబ్బందులు శ్రీధర్ బాబు ఎదుర్కొంటున్నారు. ఆయన పార్టీపై ఉన్న అభిమానంతో టిఆర్ఎస్ నుంచి ఆఫర్లు వచ్చినా వెళ్ళలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన కాంగ్రెస్ లో ఉన్నా భవిష్యత్తు పై బెంగతో టిఆర్ఎస్ లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ పెద్దలతో ఈ విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలోనూ దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా శ్రీధర్ బాబు ఖండించకపోవడం ఇది నిజమనే వాదనను బలపరుస్తోంది.IHG


 ఈ ప్రచారం ఇలా ఉండగానే తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు శ్రీధర్ బాబు  ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే పిసిసి అధ్యక్ష పదవి దక్కక పోతే దాన్ని సాకుగా చూపించి ఆయన టిఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశం ఉంది. కానీ శ్రీధర్ బాబు ముఖ్య అనుచరులు మాత్రం ఈనెల 7వ తేదీన మంత్రి కేటీఆర్ సమక్షంలో శ్రీధర్ బాబు టీఆర్ఎస్ లో చేరతారని చెబుతున్నారు. రెండు మూడు రోజుల్లోనే దీనికి సంబంధించి పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: