ప్రస్తుతం కరోనా  వైరస్ ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. చైనాలోని వుహాన్  నగరంలో గుర్తించబడిన  ప్రాణాంతకమైనవైరస్  భారిన పడి  ఇప్పటికి మూడు వేల మందికి పైగా ప్రాణాలను బలిగొంది. అంతేకాకుండా 85 వేల మందికి పైగా ఈ ప్రాణాంతకమైన వైరస్ బారినపడి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మృతుల రోజు రోజుకి  ఇంకా పెరిగిపోతుంది. ఇక మరోవైపు.. ప్రపంచ దేశాలను కూడా వ్యాపిస్తుంది  ఈ ప్రాణాంతకమైన వైరస్ . ఇప్పటికే ప్రపంచ దేశాలు ఈ వైరస్ మహమ్మారి  బారిన పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈ మహమ్మారి వైరస్ మాత్రం విలయ తాండవం చేస్తు  ప్రపంచ దేశాలకు కూడా శరవేగంగా  వ్యాప్తి చెందుతుంది. 

 

 

 ఇప్పటికే ఈ ప్రాణాంతకమైన వైరస్ ప్రపంచంలోని  57 దేశాలకు వ్యాప్తి చెందిన విషయం. చైనా దేశంలో విజృంభిస్తున్న కరోనా...  మరో వైపు ఉత్తర కొరియా లో కూడా మ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఇక ఈ ప్రాణాంతకమైన వైరస్ భారతదేశంలో కూడా వ్యాపించిన విషయం తెలిసిందే. భారతదేశంలోనే కేరళ రాష్ట్రంలో ఈ ప్రాణాంతకమైన వైరస్ కు సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎంతగానో అలర్ట్ అయిపోయాయి. 

 

 

 అయితే తాజాగా కరోనా  వైరస్ సోకింది అంటూ తైవాన్ కు  చెందిన ఓ వ్యక్తి తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తైవాన్ వాసికి  కరోనా  లేదు అంటూ వైద్యులు వెల్లడించారు. ఇటీవలే రుయా ఆసుపత్రిలో  చేరిన అతడిలో కరోనా  లక్షణాలు కనిపించడంతో... అతని రక్త నమూనాలను సేకరించి హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం పంపించారు. ఇక గాంధీ ఆస్పత్రిలో ఆయన రక్త నమూనాలను పరీక్షించిన వైద్యులు కరోనా నెగిటివ్  రావడంతో... ఆసుపత్రి నుంచి ఇవాళ డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇక తైవాన్ వాసికి కరోనా  వైరస్ లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: