తెలంగాణ రాజకీయ నేతలలో చాలా దూకుడుగా ఉండే రాజకీయ నాయకులు రేవంత్ రెడ్డి. తెలుగుదేశం పార్టీలో ఉన్నా గానీ మరియు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా గాని ప్రత్యర్థి ఎంతటి వాడైనా ముఖ్యమంత్రి అయిన కడిగిపారేసి పరువు తీసే విధంగా చెమటలు పట్టే విధంగా అద్భుతమైన వాక్చాతుర్యం కలిగిన వాడు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడిగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకురావాలని అష్టకష్టాలు పడుతున్న రేవంత్ రెడ్డికి పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఎదగనీయకుండా కుయుక్తులు వేయడంతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి రెడీ అయినట్లు తెలంగాణ రాజకీయ వార్తలు వస్తున్నాయి.

 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకురావడానికి అధ్యక్షుడు పదవిని ఇవ్వాలని గతంలో ఢిల్లీలో రాహుల్ గాంధీని మరియు అదే విధంగా పార్టీ పెద్దలను కలిసిన రేవంత్ రెడ్డికి సానుకూల సమాధానం అప్పట్లో వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మాత్రం తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పోటీ పడుతున్న రేవంత్ రెడ్డికి అధిష్టానం నుండి సరైన రెస్పాండ్ రావడం లేదంట. దీంతో ఈ విషయాన్ని కర్ణాటకలో తనకు సన్నిహితంగా ఉండే ఒక కాంగ్రెస్ పెద్ద ని అడిగి తెలుసుకున్నారట.

 

దీంతో ఇది నిజమని తేలడంతో ఇదే సమయంలో తలపై భూదందాల కేసు టిఆర్ఎస్ పార్టీ పెట్టడంతో కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో పెద్దగా సహకరించకపోవడంతో రేవంత్ రాజీనామా చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. ఇటువంటి తరుణంలో ఎప్పటినుండో రేవంత్ రెడ్డిని బిజెపి పార్టీలోకి తీసుకోవాలని బీజేపీ పార్టీ పెద్దలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వార్తలు విన్న మోడీ వెంటనే రేవంత్ రెడ్డి కి ఫోన్ చేయడం జరిగిందని... తెలంగాణలో 'అద్దిరింది నీ పోరాటం ..బిజెపి పార్టీలోకి వచ్చేయ్' నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది నువ్వు వస్తానంటే కేంద్రమంత్రి పదవి గ్యారెంటీ ఇస్తామని బంపర్ ఆఫర్ రేవంత్ రెడ్డికి ఇచ్చినట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: