ఎట్టకేల కు ఆ రోజు రానే వచ్చింది... సంవత్సరం నుంచి ఎన్నో కష్టాలు పడుతూ చదివిన విద్యార్థుల భవితవ్యం తేల్చే పరీక్షలు వచ్చేసాయి.. నేటి నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రారంభంకానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 10 లక్షల 65 వేల 156 మంది విద్యార్థులు ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తుండగా తెలంగాణ రాష్ట్రంలో 9 లక్షల 65 వేల 827 మంది విద్యార్థులు ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాయనున్నారు. ఇంటర్ పరీక్షలకు ఒక్క నిమిషం నిబంధన కూడా అమలు చేసింది ప్రభుత్వం. అయితే ఇది ఆంధ్రప్రదేశ్ లో అమలు లేకపోయినప్పటికీ... తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అమలులో ఉంది. పరీక్ష కేంద్రాలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా... పరీక్ష రాసేందుకు నిరాకరించనున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో పరీక్ష రాసే విద్యార్థులు అందరూ 30 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 

 

 

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఈ నిబంధనలను సడలించారు. కొన్ని నిమిషాలు ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు కూడా నిర్ణయించింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ కోసం తొలిసారి ఇన్విజిలేటర్ల జంబ్లింగ్ విధానాన్ని అమలు చేసింది ఇంటర్ బోర్డు. ఇక అటు పరీక్షల నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 411 కేంద్రాలను... తెలంగాణ రాష్ట్రంలో 1339 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. 

 

 

 అయితే ఇప్పుడే  ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు ఇటు తెలంగాణ  రాష్ట్రాల్లో కూడా కరోనా  కేసులు తెర మీదికి వస్తున్న నేపథ్యంలో అధికారులు కాస్త అప్రమత్తమయ్యారు. ఎగ్జామ్ సెంటర్ లకు వచ్చిన విద్యార్థులు అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పరీక్షల సందర్భంగా ఎక్కువ మంది విద్యార్థులు ఒకే చోట ఉండే అవకాశం ఉండటం వల్ల... ఎవరికైనా కరోనా  సోకి ఉంటే ఇతరులకు కూడా వ్యాపించే అవకాశం ఉందని... అందుకే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే కరోనా  బారిన పడకుండా ఉండొచ్చు అని విద్యార్థులకు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: