ఏంటి అండి.. ఇది మరి దారుణంగా లేదా? నిమిషం ఆలస్యం వచ్చాడు అని ఆ విద్యార్థి సంవత్సరం చదువును నాశనం చేస్తారా? అనుకోకుండా ఆలస్యం అవుతుంటుంది. ఎవరైనా కావాలని లెట్ చేస్తారా? ఎన్ని సమస్యల కారణంగా ఆలస్యం అయ్యిందో. ఒక్క నిమిషానికే విద్యార్థి జీవితాన్ని నాశనం చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? అని ఎప్పటి నుండో ప్రశ్నిస్తున్న ఉపయోగం లేకుండా పోయింది. 

 

ఎందుకంటే ?విద్యార్థులు కావాలని లేట్ చెయ్యరు.. వాళ్ళు పరీక్షా కోసం ఎంతో కష్టపడి చదువుతారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల విద్యార్థులు అనుకోకుండా లెట్ వస్తారు. కానీ అవి ఏవి పట్టించుకోకుండా.. విద్యర్థి లెట్ ఏ ప్రథమ కారణంగా చూపించి విద్యార్థులను పరీక్షా కేంద్రాలలోకి అనుమతించడం లేదు పరీక్షా అధికారులు. 

 

ఇలా అనుమతించకపోవడం ఇది మొదటిసారి ఏమి కాదు.. గతంలో ఎన్నో సార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి.. ఎంత బ్రతిమిలాడినా సరే నిమిషం లెట్ వచ్చిన విద్యార్థులను పరిక్ష కేంద్రాలలోకి అనుమతించకుండా జీవితం నాశనం చేస్తున్నారు. ఈ రూల్ కారణంగా ఎంతోమంది విద్యార్థులు అవస్దలకు గురయ్యారు. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే మరో విద్యార్థి నిమిషం ఆలస్యం కారణంగా ఆ విద్యార్థిని పరీక్షా కేంద్రానికి అనుమతించకుండా సంవత్సరం జీవితాన్ని నాశనం చేశారు. ఈ ఘటన మరెక్కడో జరగలేదు.. తెలంగాణలో బెల్లంపల్లి పట్టణం ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాలలో జరిగింది. ఆ కళాశాలకు హాజరైన భానుప్రసాద్ అనే విద్యార్థి నిమిషం ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి హాజరయ్యాడు.  

 

దీంతో ఆ విద్యార్థిని పరీక్షా రాసేందుకు అనుమతించేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో విద్యార్థి బోరున విలపిస్తూ ఇంటికి వెళ్లిపోయాడు. భానుప్రసాద్ స్థానిక భారతి జూనియర్ కళాశాలలో చదువుతున్నాడు అని సమాచారం. అయితే ఈ ఘటన గురించి తెలుసుకున్న నెటిజన్లు అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: