ప్రపంచ దేశాలకు శర వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమందిని ప్రాణభయంతో వణికిస్తూ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటున్న వ్యాధి కరోనా వైరస్. ఇప్పటికే చైనా దేశంలో మరణ మృదంగం మోగిస్తున్న ఈ  ప్రాణాంతకమైన వైరస్ ఆయా  దేశాల ప్రజలు ప్రాణ భయంతో వేధిస్తోంది. ఇప్పటికే చైనా దేశంలో ఈ ప్రాణాంతకమైన వైరస్ తో ఎంతో మంది ప్రజలు చనిపోగా ప్రపంచంలోని 57 దేశాలకు కూడా ఈ ప్రాణాంతకమైన వ్యాపించింది, అయితే ఒక్కసారిగా ప్రపంచ దేశాల్లో ఈ కరోనా  వైరస్ గుర్తించబడుతుండంతో.. ఫేస్ మాస్కులు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. అంతేకాదు ఫేస్ మాస్కులు కొరత కూడా భారీగానే ఏర్పడింది. 

 

 

 అయితే ఈ అవసరాన్ని ఆసరాగా చేసుకొని డబ్బులు సంపాదించాలి అనుకున్నాడు ఇక్కడ ఒక బ్రిటీష్ ట్రక్కు డ్రైవర్. మాస్కులు అమ్మి సొమ్ము చేసుకోవాలనుకున్న  బ్రిటిష్ ట్రక్  డ్రైవర్ ను మొరాకో  పోలీసులు  అరెస్టు చేశారు. అయితే వివరాల్లోకి వెళితే... బ్రిటన్ నుంచి మొరాకో రేవుకి 25 కోట్ల రూపాయల విలువైన ఫేస్ మాస్కులు బ్రిటిష్ డ్రైవర్ తీసుకొచ్చాడు. అప్పుడే ఆ డ్రైవర్ కు పాడు బుద్ధి వచ్చి  డౌన్లోడ్ చేయకుండా వాటిని బ్లాక్ లో అమ్ముకోవాలి అనుకున్నాడు. ఈ క్రమంలోనే  తిరిగి వెల్తున్నసమయంలో కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాడు ఆ బ్రిటన్ డ్రైవర్. అయితే ప్రస్తుతం కరోనా  ఎఫెక్టుతో మాస్క్ లకు  విపరీతమైన డిమాండ్ ఉండడంతో రెండున్నర వేల రూపాయలకు ఒక మాస్క్  అమ్ముకుని  డబ్బులు సంపాదించుకోవాలి ఆ డ్రైవర్ భావించినట్లు మొరాకో పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే ఆ డ్రైవర్ పేరు మాత్రం మోరకో పోలీసులు బయటకు వెల్లడించలేదు. 

 

 

 అయితే సోమవారం రోజున మొరాకోలో   మొదటి కరోనా కేసు బయటపడింది. ప్రస్తుతం ఆ కరోనా  బాధితుడిని  కాసాబ్లాంకా  ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మామూలుగా అయితే ప్రపంచవ్యాప్తంగా సగం మార్కెట్ కు  ఫేస్ మాస్క్ లను చైనా లోని పలు కంపెనీలు సరఫరా చేస్తూ ఉంటాయి కానీ ప్రస్తుతం కరోనా  ఎఫెక్ట్ ప్రభావంతో మాస్క్ లను  పంపిణీ చేసే కంపెనీలు అన్నీ ఒక్కసారిగా మూతపడడంతో... ప్రపంచవ్యాప్తంగా మాస్క్ లకు  కొరత ఏర్పడింది. దీంతో ఒక్కసారిగా మాస్కుల ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. అంతే కాదు పలు సర్జికల్ షాప్ లలో ఆస్పత్రుల నుంచి మాస్కులు కూడా చోరీలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఎంతో విలువైన ఆస్తులను కాపాడుకున్నట్లుగా   ప్రస్తుతం మాస్క్ లను కూడా  కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది  కొన్ని దేశాల్లో అయితే మాస్క్ ల  కొరత కారణంగా ఉపయోగించిన మాస్క్ లను  తిరిగి ఉతికి ఇస్త్రీ చేసి అమ్ముతున్న కార్మికులను అరెస్టు కూడా చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: