ప్రపంచ దేశాలను భయపెడుతున్న కరోనా వైరస్  ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి కూడా చేరిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్ నగర వాసులు అందరూ ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే భయపడిపోతున్నారు. ప్రాణ భయంతో ని అందరు వణికిపోతున్నారు. అయితే హైదరాబాద్ లో కరోనా కేసులు ఇంతకింతకు  ఎక్కువవుతున్నాయి. రాజశేఖర్ మైండ్ స్పేస్ కంపెనీలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి లో కరోనా  లక్షణాలు కనిపించడంతో... హైదరాబాద్ నగరం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీంతో వెంటనే  మైండ్ స్పేస్  కంపెనీ ప్రతినిధులతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ భేటీ అయ్యారు. 

 

 

 ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్... మైండ్ స్పేస్  లో పనిచేసే పనిచేసే ఓ ఉద్యోగికి  కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయని  కానీ దీనికి సంబంధించి రిపోర్టులు ఇంకా రాలేదు అంటూ సీపీ సజ్జనార్ తెలిపారు. అంతేకాకుండా మైండ్ స్పేస్ లో కరోనా  లక్షణాలు ఉన్న ఉద్యోగిని తో సన్నిహితంగా ఉన్న సహోద్యోగులకు  కూడా కరోనా  పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.. కరోనా వైరస్ కు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు మెసేజ్లు ప్రచారం లాంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సైబరాబాద్ పోలీస్ సజ్జనార్. 

 


 అయితే మైండ్ స్పేస్ లో పనిచేసే ఉద్యోగిని యొక్క  రక్త నమూనాలను సేకరించి పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి  పంపాము  అంటూ తెలిపిన సజ్జనర్... అక్కడి నుంచి రిపోర్ట్ రావాల్సి ఉంది అంటూ వెల్లడించారు. ప్రజలు ఎవరు కరోనా  వైరస్ కు సంబంధించి అసత్య ప్రచారాలను నమ్మి ఆందోళనకు గురి కావద్దు అంటూ సూచించారు సీపీ సజ్జనార్. అయితే బెంగళూరులో పనిచేసే ఓ వ్యక్తి తాజాగా హైదరాబాద్ రావడంతో హైదరాబాద్ లో కరోనా  వైరస్ ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వంను  సంప్రదించిన తర్వాతే వర్క్ ఫ్రేమ్  హోమ్ ఆదేశాలు ఇవ్వాలి అంటూ .. ఐటీ కంపెనీలకు సూచించారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్.

మరింత సమాచారం తెలుసుకోండి: