చిన్న నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెస్తుందన్న విషయం తెలిసినా కూడా కొందరు భయం లేకుండా ప్రవర్తిస్తారు.. ముఖ్యంగా ప్రయాణాల సమయంలో.. అందులో రైల్వే సమక్షంలో సాహసాలు చేస్తారు.. అప్పటికే రైల్వే అధికారులు ప్రయాణికులకు ఎన్ని జాగ్రత్తలు చెప్పిన చెవికి ఎక్కించుకోరు.. ఇంకా కొందరు మూర్ఖులైతే హద్దుమించి ప్రవర్తిస్తారు.. ఇదిగో ఓ ముసలవ్వ ఇలాగే తనకు మించిన పనిని చేసి ప్రాణాలను ప్రమాదంలో పడేసుకుంది..

 

 

ఇటీవల మహారాష్ట్రలోని లోనావాలా రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటన తెలుసుకుంటే గుండెదడ పెరగక తప్పదు.. అంత వయస్సు వచ్చిన సరైన ఆలోచన చేయక ఓ బామ్మ అధికారుల మాటలు పెడచెవిన పెట్టీ తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది. అదేమంటే  గూడ్స్ బండి కింద నుంచి దాటబోతున్న సమయంలో ఆ రైలు కదిలింది. దీంతో అక్కడున్న వారు ఆమెను పట్టాల మధ్యలో పడుకోమంటూ అరిచారు. స్థానికుల మాట విని ఆ బామ్మ రెండు పట్టాల మధ్య కదలకుండా పడుకుని ఉంది. గూడ్స్ బండి వెళ్తున్నంతసేపు పట్టాల మీద పడుకొని ఉన్న బామ్మను చూసిన వారి గుండెల్లో రైళ్లు పరిగెట్టినంత పనయింది.

 

 

అయితే, ఆమె కొంచెం బక్కపలచగా ఉండడంతో ప్రాణాపాయం తప్పింది. కానీ కొంచెం లావుగా ఉన్నా, గూడ్స్ బండి బోగీలు లేదా, ఇనుప చైన్లకు ఆమె చీర తలిగినా ప్రాణాలు పోయేవి.ఇక ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారంతా ఈ బామ్మకు ఇంకా భూమ్మీద నూకలు ఉన్నట్టున్నాయి. అందుకే బతికి బట్టకట్టిందటూ చర్చించుకుంటున్నారట.

 

 

చూసారా అడ్దదారిలో పోదామని ప్రయత్నించిన ఆ పెద్దమనిషి చావుకు అడ్దంగా బుక్కైయ్యేది కానీ ఇంకా ఆమె ఆయుష్ గట్టిది కాబట్టి లోకాన్ని చూడగలుగుతుంది.. అందుకే అంటారు అప్పుడప్పుడు చేసేపనిలో లోతు తెలుసుకుని అడుగెయ్యాలని.. ఇలా వయస్సుని మరచి ప్రవర్తిస్తే ఇదిగో ఇలాగే ప్రమాదాలు ఎదురుగా వస్తాయి...

మరింత సమాచారం తెలుసుకోండి: