చైనా దేశంలో మరణ మృదంగం మోగిస్తూ ఇప్పుడు వరకు ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుని ఇంకా ఎంతో మందిని మృత్యువుతో పోరాడేలా చేస్తున్న వైరస్ కరోనా. అయితే ఇప్పటికే ఈ ప్రాణాంతకమైన వైరస్ ప్రపంచంలోని 57 దేశాలకు కూడా వ్యాపించింది  అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మన భారతదేశానికి కూడా వ్యాపించింది ఈ ప్రాణాంతకమైన కరోనా వైరస్. అయితే మొన్నటి వరకు కేరళలో మూడు పాజిటివ్ కేసులు నమోదవగా తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ని హైదరాబాదులో కూడా ఒక కరోనా కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇక రోజురోజుకు కరోనా  అనుమానితులు కూడా పెరిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో  హైదరాబాద్ వాసులు కూడా ప్రాణభయం తోనే బతుకుతున్నారు. 

 

 

 అయితే హైదరాబాద్ లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి తో పాటు కరోనా  వైరస్ సేవలకు గాను పలు ప్రైవేట్ ఆస్పత్రులు కూడా ముందుకు వస్తున్నాయి. కరోనా  అనుమానితుల తో గాంధీ ఆసుపత్రికి ఎక్కువ తాకిడి ఏర్పడడంతో ప్రైవేట్ ఆస్పత్రులు కూడా ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసి కరోనా కు  సంబంధించిన పరీక్షలు నిర్వహించాలని సూచించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే కరోనా  అనుమానితులను ఉచితంగా చికిత్స అందించేందుకు ముందుకు వచ్చిన ప్రైవేట్ ఆస్పత్రులను అభినందించారు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. 

 

 

 అయితే కరోనా వైరస్ పరీక్షలకు సంబంధించిన కిట్లు  కేవలం గాంధీ ఆస్పత్రిలోనే అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా కరోనా  ఉంటే వారి రక్త నమూనాలను సేకరించి గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇక గాంధీ ఆస్పత్రిలో ఆ నమూనాలను పరీక్షించిన తర్వాత...  నమూనాలలో కరోనా పాజిటివ్  ఉందని తేలితే ఆ నమూనాలను... పూణేలోని వైరాలజీ ల్యాబ్ కు  పంపిస్తారు. అయితే ఇప్పటికే కరోనా  అనుమానితులు రోజు రోజుకు పెరుగుతుండటంతో గాంధీ ఆసుపత్రి తో పాటు ఉస్మానియా ఆస్పత్రిలో కూడా ఐసొలేషన్ వార్డులు  ఏర్పాటు చేశారు. ఇక మరికొన్ని ప్రైవేటు ఆస్పత్రులు కూడా కరోనా  అనుమతులకు ఐసోలేషన్ వార్డులో చికిత్స అందించేందుకు ముందుకు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: