చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టుగా తయారైంది కొంతమంది టిడిపి నాయకులు వ్యవహారం. పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఏపీలో అంతంత మాత్రంగా ఉండటంతో పాటు భవిష్యత్తులోనూ పార్టీ పుంజుకునే అవకాశం కనిపించకపోవడంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆవేదనలో ఉండగా.. కొంత మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ బాధలు ఏవీ తమకు పట్టనట్టుగా వ్యవహరిస్తూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆ విధంగానే ఇప్పుడు టిడిపి నాయకుడు వెలగపూడి రామకృష్ణబాబు ఓ వివాదంలో చిక్కుకున్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పై కొంతకాలంగా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తరచుగా ఆయన వివాదాల్లో చిక్కుకుంటున్నారు.

IHG


 తాజాగా విధి నిర్వహణలో ఉన్న ఓ అధికారిపై వెలగపూడి అనుచరులు దాడులు చేయడం వివాదాస్పదమైంది. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడంతో నిందితులను వదిలేయాలంటూ వెలగపూడి పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఎంవిపి కాలనీ పరిధి ఏడవ వార్డులో పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న శానిటరీ ఇన్స్పెక్టర్ పై దాడులకు దిగడం తో తెలుగుదేశం నాయకుల రౌడీయిజం మరోసారి వెలుగు చూసింది. ఇంతకీ విషయం ఏంటంటే ఎంవిపి కాలనీ పరిధిలోని ఏడవ వార్డు సానిటరీ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నత్రినాథ్ అనే అధికారిపై వెలగపూడి అనుచరులు దాడికి దిగారు. ఇటీవల ఏడవ వార్డులో జివిఎంసి కమిషనర్ శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా సెక్టర్-9 రోడ్లపై విచ్చలవిడిగా ఆవులు, గేదెలు కట్టి ఉండడాన్ని గమనించిన ఆయన ఈ వ్యవహారంపై స్థానికులను పిలిచి మాట్లాడారు. 

 


స్థానికులు కూడా రోడ్లపై వెళ్లేందుకు గేదెలు,ఆవులు అడ్డంగా ఉంటున్నాయని కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఆవులు గేదెలను రోడ్డుపై కట్టిన వారికి అపరాధ రుసుము విధించాలంటూ ఇన్స్పెక్టర్ ను ఆదేశించగా శానిటరీ ఇన్స్పెక్టర్ ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు జరిమానా విధించారు.ఒకరు జరిమానా విధించగా, మిగతావారు అపరాధ రుసుము చెల్లించేందుకు నిరాకరించారు. అంతేకాకుండా జరిమానా విధించిన  శానిటరీ ఇన్స్పెక్టర్ పై ఎన్.వి.రమణ,పోలరావు అనే వ్యక్తులు దాడికి దిగారు. వెంటనే ఆయన ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పోలీస్ స్టేషన్ కు తరలించారు.


 ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు రంగంలోకి దిగి రమణ, పోలరో ను విడుదల చేయాలని, వారిపై ఎటువంటి కేసులు నమోదు చేయవద్దంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం బయటకు పొక్కి వివాదాస్పదం అవ్వడంతో ఎంవిపి పోలీస్స్టేషన్ సీఐ షణ్ముఖ రావు ఎమ్మెల్యే అనుచరులు ఇద్దరిపైనా కేసు నమోదు చేశారు. అధికారులపై దాడులు చేసిన వ్యక్తులను ఎమ్మెల్యే వెనకేసుకు రావడం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: