చెప్పుకోవడానికి కేంద్ర అధికార పార్టీ అని గర్వంగా ఉన్నా.. ఏపీలో ఆ పార్టీ పరిస్థితి చూస్తే అయోమయం దేవాలయం అన్నట్టుగా తయారైంది. కేంద్ర అధికార పార్టీకి ఉండాల్సిన లక్షణాలు కానీ, ఉత్సాహంగా ఏపీ బీజేపీ నేతల్లో కనిపించడం లేదు. కనీసం ప్రాంతీయ పార్టీలు కంటే దారుణమైన దుస్థితిని ఇక్కడ బిజెపి ఎదుర్కొంటోంది. ఏపీలోకి ఆ పార్టీ కొత్తగా ఏమైనా వచ్చిందా అంటే ఎప్పటి నుంచో ఉంది. కానీ ఏ విషయంలోనూ ముందుకు వెళ్లలేక వెనక్కి వెనక్కి వెళ్తోంది. ఏపీ బీజేపీ ని సమర్థవంతంగా, ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లే నాయకులు కూడా కరువయ్యారు. ప్రజా ఉద్యమాలు, పోరాటాలు చేసే విషయంలోనూ, తీసుకునే నిర్ణయాల్లోనూ సమన్వయం కానీ, వ్యూహం కానీ కనిపించడం లేదు.

IHG


 రాజధాని విషయానికి వస్తే మూడు రాజధానులు వద్దని, ఏపీ రాజధానిగా అమరావతి నే కొనసాగించాలంటూ ఏపీ బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో ఉద్యమం చేపట్టారు. ఈ విషయంలో టీడీపీ, జనసేనకు కూడా బిజెపికి మద్దతు తెలిపింది. అయితే కేంద్రం మాత్రం మీ రాజధాని మీ ఇష్టం, మూడు కాకపోతే  30 పెట్టుకోండి అంటూ క్లారిటీ ఇచ్చేసింది.దీంతో ఏపీ బీజేపీ నేతలు గందరగోళం లో పడ్డారు. రాష్ట్రమంతా బీజేపీకి ఆదరణ లేకపోయినా కృష్ణ, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో బలపడుతుందా  అంటే ఆ ఆశలు కూడా ఇప్పుడు ఏపీ బీజేపీ నేతల్లో కనిపించడం లేదు. 

 

IHG

వాస్తవానికి బిజెపిపై రాజధాని ప్రాంత వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రాజధానిని అమరావతి నుంచి తరలించే కార్యక్రమం బిజెపి అడ్డుకుంటుందని, అమరావతి బిజెపి నాయకులైన కన్నా లక్ష్మీనారాయణ, సుజనాచౌదరి వంటి వారి చుట్టూ తిరిగారు. అయినా బీజేపీ నుంచి ఎటువంటి స్పందన కనిపించలేదు. అదే సమయంలో కర్నూలు కు హైకోర్టు తరలించడాన్ని ఏపీ బీజేపీ నేతలు అంగీకరించారు. ఇక అమరావతి కి మద్దతుగా బిజెపి జనసేనతో కలిసి బెజవాడలో లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించి తర్వాత వెనక్కి తగ్గాయి. ఇప్పుడు అమరావతి విషయం కాదు కదా ఏ విషయంలోనూ బిజెపి నేతలు వైసీపీ ప్రభుత్వం పై పొరాడేందుకు సిద్ధపడడం లేదు. 

IHG

ఈ పరిణామాలన్నీ కొత్తగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన కు చికాకు కలిగిస్తున్నాయి. అనవసరంగా తాము పొత్తు పెట్టుకుని పెద్ద తప్పు చేశాము అంటూ వారు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో ఎన్ని పరిణామాలు జరుగుతున్నా ఏపీ బీజేపీ నేతల్లో మాత్రం మార్పు కనిపించడంలేదు. అసలు పార్టీ భవిష్యత్తుపై ఏ ఒక్క నేతలోనూ ఆందోళన కనిపించడంలేదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: