కరోనా  వైరస్ ప్రస్తుత ప్రపంచ దేశాలను భయపెడుతున్న విషయం తెలిసిందే. చైనాలోని వుహాన్ నగరంలో గుర్తించబడిన ఈ ప్రాణాంతకమైన వైరస్ ప్రస్తుతం శర వేగంగా ప్రపంచ దేశాలకు కూడా వ్యాప్తి చెందుతుంది. మొన్నటివరకు  చైనాలో కరోనా  విజృంభించి ఏకంగా మూడు వేల 200 మందికి పైగా ప్రాణాలను బలిగొన్నది.  ఈ ప్రాణాంతకమైన మహమ్మారి... ఇప్పుడు చైనా దేశంలో తగ్గుముఖం పట్టినప్పటికీ మిగతా దేశాల్లో మాత్రం విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారతదేశంలోకి ప్రవేశించి శరవేగంగా వ్యాప్తి చెందుతుంది ప్రాణాంతకమైన వైరస్. దీంతో  భారత ప్రజలు కూడా ప్రాణభయంతో వణికిపోతున్నారు. 

 

 

 ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు భారత్లోని పలు రాష్ట్రాలలో కరోనా  పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక్కసారిగా అలెర్ట్  అయిపోయాయి. ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు . అయితే కరోనా  వ్యాప్తి వేగంగా ఉన్నందున ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ,బీహార్ ,ఉత్తరప్రదేశ్, పంజాబ్,  సిక్కిం, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు  అన్ని  ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. 

 

 ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ ఈ ఆరు రాష్ట్రాల ను ఆదేశిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం భారతదేశంలో కరోనా బాధితుల సంఖ్య 30కి చేరుతుంది. ఆగ్రా నగరానికి చెందిన ఆరుగురు సభ్యుల కుటుంబం కరోనా వైరస్ తో బాధపడుతున్న వ్యక్తి తో వుండడంతో ఆ కుటుంబానికి కూడా ఢిల్లీలోని సాప్దర్జాంగ్  ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా అనుమానితులు భారీగానే రోజురోజుకు పెరిగిపోతున్నారూ. ఈ నేపథ్యంలో మొత్తం అలర్ట్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రజలు ఎన్నో ముందు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: