ప్రస్తుతం చాలామంది ప్రజాప్రతినిధులపై కేసులు  ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఐటీ కేసులు నమోదు చేయడమే కానీ ప్రజాప్రతినిధులపై ఉన్న ఐటీ కేసులు మాత్రం పరిష్కారమైన దాఖలాలు లేవు. ఏళ్ల తరబడి సాగిపోతూనే ఉన్నాయి. అయితే ఇలా ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను కేవలం ఏడాదిలో పరిష్కరించాలని గతంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ విచారణకు అనుగుణంగానే ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ అవి ఆచరణకు మాత్రం నోచుకోలేదు. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకుల కేసుల సంవత్సరాల తరబడి వాయిదా పడుతూనే ఉన్నాయి. ఈ కేసులో అసలు రాజకీయ నాయకులు దోషుల నిర్దోషుల అనేది మాత్రం తేలడం లేదు. 

 

 అయితే తాజాగా దీనిపై మరొకసారి సుప్రీంకోర్టు స్పందించింది. అయితే ఇలా రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు కేసులు సంవత్సరాల తరబడి సాగిపోతున్న తరుణంలో పబ్లిక్ ఇంట్రెస్ట్  పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైన నేపథ్యంలో.. ఈ కేసుల విషయంలో ఏం చేశారు అని కేంద్రాన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. 11 రాష్ట్రాల్లో 12 స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేసి కేవలం ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు కేసులు మాత్రమే విచారించాలని  నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. 

 

 ఇప్పటికే ఎన్నో కేసులు విచారణలు కూడా పూర్తయ్యాయని.. కానీ హైకోర్టు మాత్రం సరిగ్గా స్పందించడం లేదు... హైకోర్టు తమకు సమాచారం పంపించడం లేదు అంటూ  కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెబుతున్న మాట. దీంతో ఈ ప్రత్యేక కోర్టులో ఎన్ని కేసులను డిస్ పోస్ చేశాయి.. ఇలాంటి సమాచారానికి సంబంధించి ఫైనల్ గా  లెక్కలు తేల్చాలని... ఆర్థిక అక్రమాల కేసులను కూడా ఈ కోర్టుల పరిధిలోకి తీసుకువచ్చి.. విచారించడం తో పాటు దేశంలోని ప్రాంతాల వారిగా ప్రజాప్రతినిధులపై ఉన్న క్రిమినల్  కేసులను  పూర్తిగా నివేదించాలని సుప్రీంకోర్టు అమికస్ క్యూరీ ని ఆదేశించింది. అంటే ఒక కమిటీని ఏర్పాటు చేసి  మొత్తం అధికారాలు ఇచ్చి ఇదంతా సమీక్షించి నివేదిక అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సక్రమంగా ముందుకు తీసుకెళ్లగలిగితే  ప్రస్తుతం ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అనేది త్వరలోనే తేలిపోతుందని  చెబుతున్నారు రాజకీయవిశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: