కల్పనా చావ్లా ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి... ఎంతో కష్టపడి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి... ఏకంగా నాసా నుండి మొదటిసారి అంతరిక్షం లోకి అడుగుపెట్టి భారత ఖ్యాతిని అంతరిక్షం వరకూ తీసుకు వెళ్ళిన మొదటి మహిళా శక్తి కల్పనా చావ్లా. 1962 మార్చి 17వ తేదీన హర్యానాలోని కర్నల్ పట్టణంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది కల్పనా చావ్లా. చిన్నప్పటి నుంచి విమానాల తయారీ... విమానాలపై ఎక్కువ ఆసక్తి ఉండడంతో. ఒకే పట్టుదలతో చదువు కొనసాగించింది. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అంటూ కల్పనా చావ్లా నిరూపించింది. కల్పనా చావ్లా ఉన్న పేదరికానికి అసలు చదువుకోలేని పరిస్థితి అయినప్పటికీ పట్టువిడవకుండా ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని ఏకంగా భారత శక్తిని ప్రపంచ నలుమూలలకు చాటిచెప్పింది. 

 

 

 1994 లో నాసా శాస్త్రవేత్తగా ఎంపికయింది కల్పనా చావ్లా. అప్పుడే ఆమె పేరు ప్రపంచానికి మొత్తం తెలిసింది. కల్పనా చావ్లా తో పాటు 2000మంది నాసాకు దరఖాస్తు చేసుకుంటే అందులో నుంచి 23 మందిని మాత్రమే ఎంపిక చేసింది. 1995లో నాసా శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు కల్పనా చావ్లా. ఇక విమానాలను నడిపేందుకు అర్హత సాధించారు. 1997లో అంతరిక్ష యానం చేసిన మొదటి భారత మహిళగా రికార్డు సృష్టించారు కల్పనా చావ్లా. కేవలం అంతరిక్షంలోకి వెళ్లడమే కాదు 367 గంటలపాటు అంతరిక్షంలోని గడిపి సరికొత్త రికార్డును సృష్టించారు. భారత ఖ్యాతిని అంతరిక్షం వరకు తీసుకెళ్లి ప్రపంచానికి చాటిచెప్పి మహిళా శక్తి ఏమిటో నిరూపించారు కల్పనా చావ్లా. 

 

 

 ఇక 2003లో మరోసారి అంతరిక్షయానం లోకి ప్రయాణం చేసే ముందు మీడియాతో మాట్లాడిన కల్పనా చావ్లా భారత  మహిళా మణులు అందరికీ ఒక స్ఫూర్తిని ఇచ్చేలా కొన్ని మాటలు చెప్పారు. భారత మహిళలందరికీ నేను ఇచ్చే సందేశం ఏమిటి అంటే... ఏదో ఒకటి చేయండి కానీ దాన్ని మీరు మనస్పూర్తిగా చేయాలనుకోవాలి... దానిలో లీనమై అనుభవించాలి. అలా లీనమై అనుభవించలేని వారు తమకు తాము వంచించుకున్నట్లే  అంటూ కల్పనా చావ్లా చెప్పిన మాటలు ఇప్పటికీ ఎంతోమంది మహిళామణులకు ఆదర్శంగా నిలుస్తూ ఉంటాయి. ఇక 2003లో అంతరిక్షయానం లోకి వెళ్ళిన కల్పనా చావ్లా తిరిగి వస్తున్న సమయంలో ఇంకా 16 నిమిషాలు నిమిషాల్లో  భూమిపైకి ఆర్బిటర్ చేరుకుంటుంది అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఆర్బిటర్ పేలిపోయి అందులోనే వ్యోమగామిలు అందరు  చనిపోయారు. ఆరోజు భారతదేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైన రోజు... ఆరోజు ఉవ్వెత్తున ఎగిసిన భారత కెరటం నేలకొరిగిన రోజు... భారత ప్రజలు ఎన్నడూ మరువలేని రోజు.

మరింత సమాచారం తెలుసుకోండి: