టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ సీఎం జగన్ పై ఉన్న రాజకీయ కక్ష ఏ విధంగా తీర్చుకోవాలో అర్థం కావట్లేనట్టుగా కనిపిస్తోంది. అందుకే ప్రతి అంశాన్ని విమర్శిస్తూ, జగన్ కు మైలేజ్ దక్కకుండా చేయడంతో పాటు, జగన్ ప్రతిష్ట మసకబార్చడమే ధ్యేయంగా ప్రయత్నాలు చేస్తున్నాడు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికిప్పుడు నిర్వహించడం చంద్రబాబుకు ఏమాత్రం ఇష్టం లేదు. ఏదో రకంగా ఈ ఎన్నికలను వాయిదా వేయించాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా జగన్ మాత్రం ఈ విషయంలో అస్సలు వెనక్కి తగ్గకుండా, మరింత స్పీడ్ గా ముందుకు వెళ్తున్నారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటువంటి అవకతవకలు, ప్రలోభాలకు గురికాకుండా ఉండేందుకు, అలాగే డబ్బు, మద్యం, నియంత్రణ నిమిత్తం ప్రభుత్వం రూపొందించిన నిఘా యాప్ ను సీఎం జగన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

 

IHG


 ఈ యాప్ తీసుకురావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అయితే దీనిపైన కూడా టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు చేశారు. అసలు ఈ నిఘా యాప్ కు, ముఖ్యమంత్రికి సంబంధం ఏంటని బాబు ప్రశ్నించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరువాత ఆ యాప్ ను జగన్ ఎలా ప్రారంభిస్తారని ఆయన ప్రశ్నించారు. జగన్ సూపర్ ఎన్నికల కమిషనర్ గా వ్యవహరిస్తున్నారని బాబు మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు ఏకగ్రీవం అవుతాయని, ఎన్నికల కమిషనర్ ఏ విధంగా ప్రకటిస్తునంరంటూ చంద్రబాబు ప్రశ్నించారు. అసలు అంతకు ముందు ఎప్పుడూ ఇంత హడావిడిగా, ఇంత గజిబిజిగా ఎన్నికలు నిర్వహించలేదని అన్నారు. 

 

IHG


ఇష్టానుసారంగా రిజర్వేషన్లను ప్రకటించారని, అసలు ఎన్నికలపై నిఘా పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది అనే ప్రశ్నలు ఈ సందర్భంగా బాబు వ్యక్తం చేశారు. బాబు విమర్శలపై వైసీపీ కూడా అదే రేంజ్ లో రియాక్ట్ అయ్యింది. చంద్రబాబుకు ఓటమి భయం ఎక్కువయిందని అందుకు ఇష్టానుసారంగా మాట్లాడుతూ, ఆందోనళ చెందుతున్నదని వారు విమర్శిస్తున్నారు. ఓటమి భయం ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉండవచ్చు కదా అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: