ఏపీ సీఎం జగన్ ఏం చేసినా అది ఒక సంచలనం గానే మారుతోంది. ఏపీలో ఇప్పుడు స్థానిక సంస్థల సమరం తీవ్ర స్థాయిలో ఉంది. రాజకీయ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఈ ఎన్నికల్లో విజేతలుగా నిలవాలని చూస్తున్నాయి. ఏపీ సీఎం జగన్ రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా స్థానిక సంస్థల ఎన్నికలను ఒకేసారి, తక్కువ సమయంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసి మరీ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అంతకుముందు  వరకు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేవారు. అది పూర్తయిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే వారు. ఆఖరులో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేవారు. దీంతో అధికారులు కూడా ఎటువంటి గందరగోళం లేకుండా విధుల్లో పాల్గొనేవారు. 

 

కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మొత్తం ఎన్నికల ప్రక్రియ అంతా 20 రోజుల్లోనే పూర్తయ్యేలా జగన్ ప్లాన్ చేసుకున్నాడు. దీనికోసం పదోతరగతి పరీక్షలను కూడా వాయిదా వేశారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే ఈ విషయంపై అధికార పార్టీ వైసీపీక ఒక క్లారిటీ ఉండడంతో ముందు నుంచి ఒక ప్లాన్ ప్రకారం వ్యవహారాలు చేసుకుంటూ వస్తోంది. కానీ వైసిపి రాజకీయ ప్రత్యర్ధులు మాత్రం గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఓటమి చెందడం నుంచి ఇంకా తేరుకోకముందే ఇప్పుడు అకస్మాత్తుగా స్థానిక సంస్థలు ఎన్నికలు మిత్రవహిస్తుండడంతో వారంతా గెలుపు పై ఆశలు వదిలేసుకున్నారు. ఎలాగూ రాష్ట్ర అధికార పార్టీ గా వైసిపి ఉండటంతో ప్రజలు కూడా అటు వైపే మొగ్గు చూపుతారనే భావనకు వైసీపీ రాజకీయ ప్రత్యర్ధులు వచ్చేశారు. అయినా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 


ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలుపు తమదే అన్నట్లుగా వైసిపి ధీమాతో ముందుకు వెళ్తోంది. ఇదే సమయంలో జగన్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు గెలుపు బాధ్యతలు అప్పగించి, తేడా వస్తే ఊరుకునేది లేదు అంటూ హెచ్చరికలు చేయడంతో ఇప్పుడు వారంతా క్షేత్ర స్థాయిలో పార్టీ క్యాడర్ తో సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో పలుకుబడిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: